S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/17/2018 - 16:38

విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికితోడు డ్రైనేజీ తవ్వకాల కోసం గుంతలు తీయటంతో డ్రైనేజీ నీరు, వర్షం నీరు చేరటంతో చిట్టినగర్, ఇస్లాంపేట, వన్‌టౌన్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.

12/17/2018 - 13:40

తిరుపతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామం అనంతరం గవర్నర్ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12/17/2018 - 13:39

అమరావతి : పెథాయ్‌ తుపాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

12/17/2018 - 13:07

కోదాడ: దొరకొంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో సచివాలయ ఉద్యోగులు హరికృష్ణ, పీఎస్ భాస్కర్ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మీ, పాపయ్యను నకిరేకల్ ఆసుపత్రికి తరలించారు.

12/17/2018 - 13:06

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారటంతో విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన విమానాలను, రైళ్లను అధికారులు రద్దు చేశారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైళ్లను కూడా రద్దు చేయటంతో ప్రయాణీకులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

12/17/2018 - 13:05

అమరావతి: పెథాయ్ తుపాను కాకినాడకు చేరువకావటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏ క్షణానైనా తీరందాటే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గంటకు 19 కి.మీ వేగంతో కదులుతున్న పెథాయ్ తుని-యానం మధ్య తీరందాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంథ్ర జిల్లాల్లో 80-90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

12/17/2018 - 04:45

విజయవాడ, డిసెంబర్ 16: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థిగా ఆపస్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం) తరపున జనె్నల బాలకృష్ణను అధికారికంగా ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శ్రావణ్‌కుమార్, పీ రవిప్రసాద్ తెలిపారు.

12/17/2018 - 04:44

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 16: పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 28వ వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ ఏడాది విశిష్ట పురస్కారాన్ని ప్రసిద్ధ ఫోరెన్సిక్ శాస్తవ్రేత్త డాక్టర్ గాంధీ పూర్ణచంద్ర కాజాకు ప్రదానం చేశారు. రూ. 5లక్షల నగదు బహుమతి అందజేశారు.

12/17/2018 - 02:45

కాకినాడ సిటీ, డిసెంబర్ 16: తుపాను కాకినాడకు 500కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడ-విశాఖపట్నంల మధ్య పెథాయ్ తుపాను తీరందాటే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. తుపాను సహాయ కార్యక్రమాలకు ఒక హెలీకాఫ్టర్‌ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

12/17/2018 - 02:41

ఆళ్లగడ్డ, డిసెంబర్ 16 : నల్లమల అటవీ పరిధిలోని రుద్రవరం రేంజ్ ఆలమూరు సెక్షన్ మిట్టపల్లె బీట్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అటవీ సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న నంద్యాల డీఎఫ్‌ఓ శివశంకర్‌రెడ్డి ఆదివారం పెద్దపులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి పాదముద్రలు సేకరించారు.

Pages