S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/21/2018 - 03:21

విశాఖపట్నం/శ్రీకాకుళం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘్ధర్మ పోరాట దీక్ష’తో ఢిల్లీ దిగిరాల్సిందేనని మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ‘్ధర్మపోరాట దీక్ష’కు సంఘీభావంగా జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో శుక్రవారం దీక్షలు చేపట్టారు.

04/21/2018 - 03:49

విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ, విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా జిల్లాల్లో మంత్రులు కూడా నిరసన దీక్షలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప కాకినాడలోని సర్పవరం జంక్షన్, బాలాజీ చెరువులో ఏర్పాటు చేసిన నిరశన దీక్షలో పాల్గొన్నారు.

04/21/2018 - 03:14

విశాఖపట్నం, ఏప్రిల్ 20: సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన తీరు అత్యంత హేయమని బీజేపీ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌లు ఖండించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో చేస్తున్న దీక్ష సందర్భంగా బాలకృష్ణ ఒక ఉన్మాది మాదిరి ప్రధానిపై విమర్శలు చేయడంపై విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు.

04/21/2018 - 03:13

హైదరాబాద్, ఏప్రిల్ 20: ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటమంటూ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఒక రోజు దీక్ష వినోదాత్మక ఈవెంట్‌గా మారిందని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాలుగా విభజన చట్టం హామీలు, అమలు, హోదా కోసం ఏ విధమైన దీక్షలు, పోరాటలు చేయకుండా చంద్రబాబు చెడ్డపేరు తెచ్చుకున్నారన్నారు. ఈ రోజు దగా దీక్షలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

04/21/2018 - 03:12

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 20: ప్రత్యేక హోదా పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు ధర్మపోరాట దీక్ష అని పేరు పెట్టినా, టీడీపీ పరంగా నిర్వహించిన ఒక ఈవెంట్‌గానే దీనిని తాము పరిగణిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. హోదా పేరుతో దీక్షకు దిగిన సీఎం ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు.

04/20/2018 - 04:03

నరసరావుపేట, ఏప్రిల్ 19: ఏపీకి అన్యాయం జరిగింది.. కేంద్రం సరిదిద్దాల్సిన అవసరం ఉంది. విభజన సమయంలో చేసిన వాగ్దానాలన్నీ అమలుచేయాలి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు అని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పాదయాత్ర అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పోరాటానికి ఐదు కోట్ల మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారని అన్నారు.

04/20/2018 - 04:01

నరసరావుపేట, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా గురువారం శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోట నుండి కోటప్పకొండ వరకు చేసిన సైకిల్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది.

04/20/2018 - 03:57

విజయవాడ, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు తాను శుక్రవారం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటలవరకు 12 గంటలపాటు ఆహారం ముట్టకుండా ధర్మ పోరాట దీక్షను చేయబోతున్నానని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు.

04/20/2018 - 03:56

విజయవాడ, ఏప్రిల్ 19: ఈ ఏడాది పశుగణాభివృద్ధి రంగంలో 20 శాతం వృద్ధి రేటు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్థక, మత్స్యశాఖల లక్ష్యాలు, సాధించిన ఫలితాలను గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించి భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనకు దిశానిర్దేశం చేశారు.

04/20/2018 - 03:55

విజయవాడ(పాతబస్తీ), ఏప్రిల్ 19: సినీ పరిశ్రమలో ఉన్నవారంతా చెడ్డవారు కాదని, ఒకరిద్దరు చేసే తప్పులకు పరిశ్రమ మొత్తాన్ని నిందించడం సరికాదని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. గురువారం విజయవాడ వన్‌టౌన్‌లోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ చెడ్డది అయితే పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ ఆడపిల్లలను ఎందుకు పంపుతారని ప్రశ్నించారు.

Pages