S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/16/2018 - 03:56

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15: మంచంపై పడి ఉన్న అసహాయ వృద్ధురాలిని ఆమె బంధువైన మరో మహిళే కర్కశంగా చిత్రహింసలకు గురి చేసిన సంఘటన అందరినీ ఆవేదనకు గురిచేసింది.

04/16/2018 - 03:52

విజయవాడ, ఏప్రిల్ 15: కృష్ణా జిల్లాలో రెండోరోజైన ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రధానంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో ప్రారంభమైన జగన్ యాత్రకు అడుగడుగునా ఎదురేగి ఘన స్వాగతం పలికారు.

04/16/2018 - 03:50

నరసరావుపేట, ఏప్రిల్ 15: గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించాలని, నరసరావుపేటకు పార్టీ ఇన్‌చార్జిని నియమించాలని కోరుతూ ఆదివారం మండలంలోని పాలపాడులో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి పులిమి రామిరెడ్డి, ఆయన భార్య కోటేశ్వరమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

04/16/2018 - 03:46

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 15: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శులుగా గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలీ నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జారీ చేసిన ఆదేశాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఆదివారం విడుదల చేశారు. ఇప్పటికే పలువురు పీసీసీ నేతలకు ఏఐసీసీలో చోటు కల్పించిన అధిష్ఠానం తాజాగా మరో ఇద్దరికి పదవులు కేటాయించింది.

04/16/2018 - 03:45

విజయవాడ, ఏప్రిల్ 15: రాష్ట్రంలో ప్రజారోగ్య వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.

04/16/2018 - 03:33

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 15: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా 5 కోట్ల మంది ఆంధ్రులను నిట్టనిలువునా దగా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు వివిధ ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.

04/16/2018 - 03:31

విజయవాడ, ఏప్రిల్ 15: బంద్ సందర్భంగా అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక హోదా, తదితర అంశాలపై కేంద్రం వైఖరికి నిరసనగా సోమవారం వివిధ రాజకీయ పక్షాలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ అధికారులతో ఆదివారం రాత్రి ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

04/16/2018 - 03:26

మార్కాపురం, ఏప్రిల్ 15: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి అలంకరణ కోసం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 6 కిలోల బరువుతో 2 కోట్ల రూపాయలతో బంగారు చీర తయారుచేయించారు. ఈనేపథ్యంలో ఆ బంగారు చీరను ఆదివారం అమ్మవారికి అలంకరించారు.

04/16/2018 - 03:23

విజయవాడ, ఏప్రిల్ 15: లౌకిక రాజ్యమైన మన దేశంలో రాజకీయ నేతలు తమ ప్రాంతాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని, అలాంటి సందర్భంలో శివస్వామి లాంటివారు వారికి మతాలను అంటగట్టి మాట్లాడటం సరికాదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య అన్నారు.

04/16/2018 - 03:21

అనంతపురం, ఏప్రిల్ 15: భిన్నత్వంతో ఉన్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పురోగతి సాధించాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, అందుకు శ్రీ్భగ్ ఒడంబడికను అనుసరించాలని, తద్వారా ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీ.లక్ష్మణరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.

Pages