S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/24/2018 - 00:58

గుంటూరు, మార్చి 23: రాష్ట్రాన్ని సారా రహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ స్పష్టంచేశారు. శుక్రవారం శాసనసభలో ఎక్సైజ్ శాఖ డిమాండ్లపై ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు 3 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల రూపాయలకు చేరాయని, బెల్టుషాపులను విస్తృతం చేశారని విమర్శించారు.

03/24/2018 - 00:56

అమరావతి, మార్చి 23: ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఒకవైపు ప్రజాందోళనలు , మరోవైపు పార్లమెంటులో ఎంపీలు పోరాడుతున్నా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. న్యాయం చేయమని అడుగుతున్న ఏపీకి ఇవ్వాల్సిన నిధుల్లో రోజుకో కోత విధిస్తూ, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం రూ.3వేల కోట్లు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించడం దారుణమని ఆయన విరుచుకుపడ్డారు.

03/24/2018 - 00:55

రాజమహేంద్రవరం, మార్చి 23: పార్లమెంటులో ఉన్న గందరగోళ పరిస్థితులను లెక్కచేయకుండా ఏ తరహాలో రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించారో అదే తరహాలో ప్రస్తుతం కేంద్రంపై వైసీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్‌చేశారు.

03/24/2018 - 00:53

గుంటూరు, మార్చి 23: ప్రతిపక్ష సభ్యులు లేకపోయినా శాసనసభలో ఒకింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మిత్రపక్షమైన బీజేపీతో అధికార టీడీపీ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో వాదోపవాదాలు చోటు చేసుకోవటం ఒక ఎత్తయితే సభలో చర్చించాల్సిన అంశాలను సకాలంలో చర్చించలేకపోతున్నామని అధికార టీడీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేయటం విశేషం.

03/23/2018 - 03:23

విశాఖపట్నం, మార్చి 22: ఉన్నత విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అటానమీ (స్వయం ప్రతిపత్తి) హోదా కల్పించడంతో పాటు కేటగిరి 1 విద్యా సంస్థగా గుర్తింపుఇచ్చిందని వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు తెలిపారు.

03/23/2018 - 02:59

విశాఖపట్నం, మార్చి 22: నీటి సమస్య ప్రపంచానికి సవాలు విసురుతోందని సీఎస్‌ఐఆర్ నేషనల్ ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంచాలకులు ప్రొఫెసర్ వీఎం తివారీ అభిప్రాయపడ్డారు. ఏయూ ఫిజిక్స్, జియాలజీ విభాగాలతో పాటు అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన జాతీయ నీటి సదస్సులో ఆయన పాల్గొన్నారు.

03/23/2018 - 02:55

అమరావతి: అమరావతిలో ఏప్రిల్ 10, 11, 12 నుంచి జరిగే సంతోష నగరాల సదస్సు (హ్యాపీ సిటీస్ సమ్మిట్ ఏర్పాట్ల)పై సీఆర్‌డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమీక్ష నిర్వహించారు. ఒకటో తేదీ నాటికి విజయవాడ నగరం ఈ సదస్సుకు ఆతిధ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని, సదస్సు సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని మన బెజవాడ సంతోష నగరంగా మారిపోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

03/23/2018 - 02:53

అమరావతి, మార్చి 22: ఇక సచివాలయ శాశ్వత నిర్మాణాల ఆకృతుల కోసం ఆలస్యం చేయవద్దని, వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డివిజన్లపై అభిప్రాయ సేకరణకు శుక్రవారం ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు ఐకానిక్ నిర్మాణాలు వస్తే ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. కేవలం భవన నిర్మాణ శైలి, దాని ఆకృతి వల్ల ఐకానిక్ అవదు.

03/23/2018 - 02:42

గుంటూరు, మార్చి 22: పోలవరం, పట్టిసీమపై కాగ్ (సీఏజీ) తప్పుబట్టిందంటుని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు కేంద్రాన్ని కూడా కాగ్ తప్పుబట్టిన నేపథ్యంలో సీబీఐ విచారణకు సిద్ధమేనా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు జల సంరక్షణ తదితర అంశాలపై సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

03/23/2018 - 02:40

అమరావతి, మార్చి 22: సమాజంలో మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజలను చైతన్యపరచి శక్తివంతులుగా తీర్చిదద్దటమే నైపుణ్య రథాల లక్ష్యమని, మే నాటికి 12 రథాలు సిద్ధమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం ఆయన నైపుణ్య రథాన్ని ప్రారంభించారు.

Pages