S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/23/2018 - 00:01

విజయవాడ, మార్చి 22: వేర్వేరు కారణాలతో ప్రస్తుతానికి ఏపీఎస్‌ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో చిక్కుకుని సతమతమవుతున్నప్పటికీ ప్రయాణికుల ఆదరణ పెరిగేలా సంస్థ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని డీజీగా పదోన్నతిపై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్‌గా గురువారం నియమితులైన ఎన్‌వి సురేంద్రబాబు అన్నారు. తాను ఈనెల 26తేదీ పదవీ బాధ్యతలు చేపడతానని ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు.

03/23/2018 - 00:01

విజయవాడ (క్రైం): సీనియర్ ఐపిఎస్ అధికారులైన ఎన్‌వి సురేంద్రబాబు, ఏఆర్ అనూరాధలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ)గా పదోన్నతి లభించింది. వీరిద్దరూ 1987 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందినవారే. ప్రస్తుతం సురేంద్రబాబు గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ అదనపు డీజీగా పని చేస్తున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు డీజీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఏఆర్ అనురాధ విధులు నిర్వహిస్తున్నారు.

03/23/2018 - 00:00

అమరావతి, మార్చి 22: హోదాకు సంబంధించి సినిమా పరిశ్రమపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చెప్పారు. అంతకుముందు ఉదయం ఎంపీలతో చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ సినీ పరిశ్రమపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. దాంతో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించవద్దని బాబు ఆదేశించారు.

03/23/2018 - 00:00

అమరావతి, మార్చి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 50 శాతం వేతనాలను పెంచుతూ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ నిర్ణయం తీసుకున్నారు.

03/22/2018 - 23:59

విజయవాడ, మార్చి 22: దీర్ఘకాలికంగా పెండింగలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నడుం కట్టారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఓ హోటల్‌లో ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో దాదాపు మూడు గంటలపాటు సమావేశమై కూలంకషంగా చర్చించారు.

03/22/2018 - 23:59

విజయవాడ, మార్చి 22: విభజన హామీలో భాగమైన కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మీనమేషాలు లెక్కిస్తున్నదంటూ రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఆవేశంతో అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వైకాపా సభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, పి.రవీంద్రనాధ్‌రెడ్డి, అమృత్‌భాషా అడిగిన ప్రశ్నలకు మంత్రి పై విధంగా స్పందించారు.

03/22/2018 - 23:58

అమరావతి, మార్చి 22: ప్రజా సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఒక్కటే ముఖ్యం కాదని, ఉత్తమ ఫలితాలు సాధించడం కూడా ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. ప్రజల సంతోషం ప్రాతిపదికగా అన్ని శాఖల పనితీరు ఉండాలని చెప్పారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 5వ సమాశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు.

03/22/2018 - 23:58

విజయవాడ, మార్చి 22: తన క్రెడిట్ కార్డు బిల్లులను తన కుటుంబ సభ్యులే కడుతున్నారంటూ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో క్లోరినేషన్ లేకుండా తాగునీటి సరఫరాపై సభ్యుడు బలరామ కృష్ణమూర్తి తదితరులు గురువారం ప్రశ్న అడిగారు. దీనికి మంత్రి బదులిస్తూ, గ్రామీణ నీటి సరఫరాలో రియల్ టైమ్ గవర్నెన్సు అమలు చేస్తున్నామన్నారు.

03/22/2018 - 23:57

విజయవాడ, మార్చి 22: రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఉన్న 51 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో 16 ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారన్నారు.

03/22/2018 - 02:26

విజయవాడ, మార్చి 21: పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన బుధవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అవిశ్వాసంపై కావాలనే చర్చ జరుగకుండా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం సభ్యుని హక్కు అని, దానిపై చర్చ జరపడం స్పీకర్ బాధ్యత అని స్పష్టం చేశారు.

Pages