S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/20/2018 - 04:05

ఒంగోలు, ఫిబ్రవరి 19 : తమ పార్టీ అధికారాన్ని చేపట్టగానే అన్ని పంటలకు తప్పని సరిగ్గా గిట్టుబాటు ధరలు కల్పిస్తామని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు భరోసా కల్పించారు.

02/19/2018 - 23:08

రాచర్ల, ఫిబ్రవరి 19: సాధారణ రైతు కుటుంబంలో జన్మించి గిద్దలూరు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన పగడాల రామయ్య (72) సోమవారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో కన్నుమూశారు. రామయ్య మృతదేహానికి మండలంలోని చినగానిపల్లి గ్రామంలో భారీ అనుచర బంధుమిత్రుల మధ్య సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.

02/19/2018 - 23:07

విజయవాడ, ఫిబ్రవరి 19: కువైట్ నుండి ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ద్వారా 5వేల మంది రాష్ట్రానికి రానున్నారని, తిరిగి వచ్చిన ప్రవాసులకు సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర న్యాయ, యువజన, క్రీడలు, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

02/19/2018 - 23:06

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై అవిశ్వాసానికి భావసారూప్య పార్టీలు ఎవరి మద్దతైనా తాము తీసుకోగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అయితే కేంద్రంపై అవిశ్వాసం అనేది అనుభవజ్ఞుడైన చంద్రబాబు పెడితేనే బాగుంటుందని, రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

02/19/2018 - 23:06

కడప, ఫిబ్రవరి 19: కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో దొరికిన ఐదు మృతదేహాలు తమిళులవేనని డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసులు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యిందని, వారి బంధువులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

02/19/2018 - 23:05

విజయవాడ, ఫిబ్రవరి 19: ఈశాన్య రుతుపవనాల సమయంలో రబీపై వర్షాభావ ప్రభావం పడిన నేపథ్యంలో 80 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తీవ్ర కరవు నెలకొన్న మండలాలుగా 54, ఒక మోస్తరు కరవు 26 మండలాల్లో ఉన్నట్లు ప్రకటించింది. కరవు మండలాల ప్రకటనకు సంబంధించి వివిధ మార్గదర్శకాలను అనుసరించి వీటిని గుర్తించింది.

02/19/2018 - 23:04

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో హోంగార్డుల వేతనాల పెంపుదలకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు. భూగర్భ, అటవీ శాఖల్లో బినామీ వ్యవస్థకు అడ్టుకట్టవేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలపై హోం, విద్యుత్, రెవెన్యూ, అటవీ, ఎక్సైజ్, దేవదాయ, ధర్మదాయ, కమర్షియల్ శాఖల అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

02/19/2018 - 23:04

అమరావతి, ఫిబ్రవరి 19: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్లో మొండిచేయి చూపిస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వరాన్ని మరింత కఠినతరంగా మారుస్తున్నారు. ఎవరి దయాధర్మం అవసరం లేదంటూ పరోక్షంగా కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మన రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి.

02/19/2018 - 05:47

తాను సిద్ధమేనన్న మాణిక్యాలరావు విష్ణువర్ధన్‌రెడ్డితో అధ్యయన కమిటీ
బాబు హామీలపై మనమూ నిలదీద్దాం అవినీతి అంశాలపై ప్రశ్నించాల్సిందే
అసెంబ్లీలో ఇక ప్రతిపక్ష పాత్ర దూకుడు పెంచిన రాష్ట్ర బీజేపీ

02/19/2018 - 05:45

రాజధాని ఎంపికపై చంద్రబాబు విజన్ గొప్పది ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు అభినందన
హరిత భవనాల అభివృద్ధికి టీఈఆర్‌ఐ సహకారం 9 నగరాల అభివృద్ధికి వికేంద్రీకృత వ్యవస్థ: బాబు

Pages