S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/06/2016 - 03:42

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సప్లైస్ కమిషనర్‌గా బుడితి రాజశేఖర్, స్ర్తి శిశు సంక్షేమ కార్యదర్శిగా జి జయలక్ష్మి, స్ర్తి శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూనం మాలకొండయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కో-ఆపరేటివ్ సొసైటీ ప్రత్యేక కమిషనర్‌గా జె మురళిని నియమించారు.

07/06/2016 - 03:41

హైదరాబాద్, జూలై 5: అమరావతి దేవాలయానికి చెందిన చెన్నైలో సదావర్తి భూములను మంత్రివర్గం, గవర్నర్‌కు తెలియకుండా దేవాదాయ శాఖ ఏకపక్షంగా ఎలా వేలం వేసి విక్రయిస్తుందని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తే అసలైన దోషులు బయటకు వస్తారని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వివరించనున్నట్లు చెప్పారు.

07/05/2016 - 18:14

కర్నూలు: లంచం ఇవ్వలేదంటూ లారీ డ్రైవర్‌పై మంగళవారం పోలీసులు దాడి చేశారు. గోస్పాడు మండలం సాంబవరం మెట్ట దగ్గర పోలీసుల దాడిలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/05/2016 - 18:11

విజయవాడ: పట్టిసీమ సాగునీటి ప్రాజెక్టులో పంపులను బుధవారం నాడు ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించేందుకు టిడిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

07/05/2016 - 18:10

విశాఖ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ నెల 7న నగరానికి వస్తున్నారు. ఆ రోజు జరిగే నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో దిగ్విజయ్‌తో పాటు ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటారు.

07/05/2016 - 18:10

విజయవాడ: నగలకు మెరుగు పెడతామని నమ్మించి సుమారు లక్ష రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ఆగంతకులు దోచుకుపోయిన సంఘటన ఇక్కడి ప్రసాదం పాడులో మంగళవారం జరిగింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఇక చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.

07/05/2016 - 18:08

కాకినాడ: రాజానగరం మండలం బొల్లకడియం వద్ద మంగళవారం ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 14 మంది జూదరులను అరెస్టు చేశారు. వీరి నుంచి 5.5 లక్షల రూపాయల నగదు, 5 బైకులు, 13 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

07/05/2016 - 18:08

ఏలూరు: తణుకు సమీపాన సజ్జాపురం వద్ద గోస్తని నదిలో తల్లీకూతుళ్ల మృతదేహాలను మంగళవారం స్థానికులు కనుగొన్నారు. మృతులను లక్ష్మీనరసమ్మ (32), ఆమె కుమార్తె లాస్య (7)గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఆదివారం నుంచి కనిపించడం లేదు. కుటుంబ కలహాల వల్లే కుమార్తెతో పాటు కాల్వలోకి దూకి తల్లి నరసమ్మ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

07/05/2016 - 18:07

కర్నూలు: అవినీతి, అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తిన వైకాపా అధినేత వైఎస్ జగన్ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. జగన్ వైఖరి నచ్చకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్నారు. ‘గడప గడపకూ వైకాపా’ కార్యక్రమానికి బదులు గడప గడపకూ వెళ్లి జగన్ క్షమాపణలు చెప్పుకోవాలన్నారు.

07/05/2016 - 17:42

నెల్లూరు : ఏఎస్‌పేట పరిధిలోని పలు కాలనీలలో పిచ్చికుక్క గతరాత్రి నుంచి ఇప్పటివరకు 23 మందిని గాయపర్చింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రబుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pages