S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/13/2018 - 04:28

వీరవాసరం, ఫిబ్రవరి 12: కేంద్ర బడ్జెట్ సమర్పణ అనంతరం ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన టీడీపీ, బీజేపీ నేతల వివాదాలు మెల్లమెల్లగా చేతల్లోకి మారుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలో సోమవారం చోటుచేసుకున్న ఘటన ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది. బీజేపీకి చెందిన నరసాపురం లోక్‌సభ సభ్యుడు గోకరాజు గంగరాజు, ఆ మండల టీడీపీ నేతల మధ్య సోమవారం ప్రత్యక్ష వాగ్యుద్ధం చోటుచేసుకుంది.

02/13/2018 - 02:45

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: కేంద్రంలో బీజేపీతో పొత్తున్నప్పటికీ ఏపీకి అన్నివిధాలా అన్యాయమే జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళల్లో ఏ ఒక్క హామీని మోదీ సర్కార్ నెరవేర్చలేదన్నారు.

02/13/2018 - 02:40

తిరుపతి, ఫిబ్రవరి 12: ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైకాపా తొలి నుంచి పోరాడుతోందని, ఈక్రమంలో మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం అందాల్సిన అన్ని అంశాలపై వైకాపా రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.

02/13/2018 - 02:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్‌ను ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యానారాయణ విజ్ఞప్తి చేశారు. సోమవారం కేంద్ర మంత్రి గంగ్వార్‌తో పితాని ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సమావేశం అయ్యారు.

02/12/2018 - 06:16

సాయంపై స్పష్టత వస్తేనే శాంతం ప్రకటన వచ్చే వరకూ ఆందోళన ఎంపీలకు సీఎం చంద్రబాబు పిలుపు
కేంద్రానివి కాకి లెక్కలు: కళా ఆకలి వేసినప్పుడే అన్నం పెట్టాలి: రామ్మోహన్
హరిబాబు ప్రకటనలో కొత్తదనమేదీ లేదని తెలుగుదేశం వ్యాఖ్య

02/11/2018 - 03:35

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 10: రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరం ఒక్కటై కేంద్రం మెడలు వంచుదామని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని పీసీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.

02/11/2018 - 03:34

తిరుపతి, ఫిబ్రవరి 10: బలిజ, కాపులకు భోజనం పెడతామని చెప్పిన బాబు అల్పాహారంతో సరిపుచ్చుతున్నారని , తమకు భోజన కావాలని కాదని మోసం చేస్తే ఆయన్ను ఎలా మోసం చేయాలో తమకు తెలుసని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. శనివారం తిరుపతి సమీపంలోని తనపల్లి వద్ద అశోక్ కనె్వన్షన్‌హాల్లో చిత్తూరు జిల్లా బలిజ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సభ జరిగింది.

02/11/2018 - 03:34

అమరావతి, ఫిబ్రవరి 10: ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసమయితే టీడీపీ పార్లమెంటులో పోరాడుతుందో, అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం అసెంబ్లీలో తామూ గళమెత్తాలని బీజేపీ నిర్ణయించింది. ప్రధానంగా రాయలసీమలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించాలన్న డిమాండుతో అటు అసెంబ్లీ, ఇటు కౌన్సిల్‌లో ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..

02/11/2018 - 03:33

విజయవాడ (బెంజ్‌సర్కిల్), ఫిబ్రవరి 10: గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా హైదరాబాద్‌కే పరిమితం చేసిన విధంగా ఏపీ అభివృద్ధి కేవలం అవమరావతికే పరిమితం చేయవద్దని రాయలసీమ న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఏపీలో ఏర్పాటు చేయతలపెట్టిన తాత్కలిక హైకోర్టును రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు.

02/11/2018 - 03:32

నిడదవోలు, ఫిబ్రవరి 10: వచ్చే నెల 5 నుంచి తిరిగి ప్రారంభయ్యే పార్లమెంటు బడ్జెట్ మలివిడత సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి సముచిత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కొద్దిసేపు విలేఖర్లతో మాట్లాడారు.

Pages