S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/11/2018 - 03:31

అమరావతి, ఫిబ్రవరి 10: రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయాన్ని వివరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు చేసిన తాజా ప్రకటన కేంద్ర ఆత్మవంచన, ఎదురుదాడికి కొనసాగింపుగానే తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

02/09/2018 - 23:48

విశాఖపట్నం, ఫిబ్రవరి 9: విశాఖ డీజిల్ లోకోషెడ్ మరో మైలురాయి దాటింది. భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న లోకో షెడ్‌లో 300వ ఇంజన్‌ను తయారు చేసి, రికార్డు సృష్టించింది. ఈ ఇంజన్‌కు విశాఖ డీఆర్‌ఎం ముకుల్ శరణ్ మాథుర్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. విశాఖ డీజిల్ లోకో షెడ్‌లో అత్యాధునిక రైల్వే ఇంజన్‌లు నిర్మితమవుతున్నాయి.

02/09/2018 - 03:31

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తాడేపల్లిగూడెంలోని ఒక ఆశ్రమంలో 22 మంది మహిళలను అక్రమంగా నిర్బంధించారనే అభియోగంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది.

02/09/2018 - 03:21

అమరావతి, ఫిబ్రవరి 8: ప్రపంచంలోనే అతి పెద్ద రైస్ మిల్లును ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పేందుకు దుబాయ్‌కు చెందిన ఫోనిక్స్ సంస్థ సన్నద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మెగా ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించి పనులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలుపెడతామని ఫోనిక్స్‌గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవో గౌరవ్ ధావన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నారు.

02/09/2018 - 03:17

అమరావతి, ఫిబ్రవరి 8: రాష్ట్రానికి రావలసిన నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ ఆందోళన కొనసాగించాలని పార్టీ ఎంపీలను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురువారం ఆయన దుబాయ్ నుంచే పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్సులో మాట్లాడారు. జైట్లీ మాట్లాడే సమయంలో ఏవిధంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు.

02/09/2018 - 03:16

అమరావతి, ఫిబ్రవరి 8: ‘మీరు సమర్పించే పత్రాలను పరిశీలిస్తాం. పెట్టుబడులు తెండి. అనుమతులు, వ్యవస్థాపక అంశాలకు నేను భరోసాగా ఉంటాను. ఆ బాధ్యత నాది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ‘మా రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖలో ఈ నెల 24,25,26తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సుకు మీరు తప్పక రావాలి’ అని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

02/09/2018 - 03:16

విజయవాడ, ఫిబ్రవరి 8: విధి నిర్వహణలో ఆత్మ సంతృప్తి కలిగేలా పనిచేస్తూ, గిరిజనులకు భవిష్యత్‌పై భరోసా కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో గిరిజన సంక్షేమంపై రాష్ట్రంలో ఐటీడీఏ పీవోలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

02/09/2018 - 03:13

విజయవాడ, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో జరుగుతున్న బంద్‌పై దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌తో ఎంవోయూ చేసుకునేందుకు, విశాఖ సమ్మిట్‌కు విదేశీ సంస్థలను ఆహ్వానించేందుకు దుబాయ్ వెళ్లిన ముఖ్యమంత్రి ఒకవైపు ఆయా పనుల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితులను అక్కడ నుంచే ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.

02/09/2018 - 03:12

విజయవాడ, ఫిబ్రవరి 8: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 8న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉగాది, రెండో శనివారం, ఆదివారాలు అసెంబ్లీ సమావేశాలు ఉండవు. 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మార్చి 28న ద్రవ్య వినిమయ బిల్లుతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.

02/09/2018 - 03:12

విజయవాడ, ఫిబ్రవరి 8: మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా సాలీనా రూ.600 కోట్లుపైగా నష్టాలతో సతమతమవుతున్న ఏపీఎస్‌ఆర్టీసీకి గురువారం నాటి బంద్ కారణంగా ఏడుకోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్టవ్య్రాప్తంగా 128 డిపోల్లోనూ ఎక్కడి బస్సులు అక్కడే నిలిచాయి. బంద్ సందర్భంగా బస్సులను నడపరాదని గత రాత్రే యాజమాన్యం నిర్ణయించుకుంది.

Pages