S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/03/2018 - 04:21

అమరావతి, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి చేసిన కేటాయింపులపై తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. దానిపై ఏవిధంగా స్పందించాలి? ప్రజాస్పందన ఏవిధంగా ఉందన్న కీలక అంశాలపై ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం పార్టీ సమన్వయ కమిటీతో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. బడ్జెట్‌పై స్పందించిన నేతలు..

02/03/2018 - 04:20

విజయవాడ, ఫిబ్రవరి 2: ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు సబ్సిడరీగా ఏపీ కంటెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. వివిధ శాఖల్లో డ్రోన్ల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం శుక్రవారం జరిగింది.

02/02/2018 - 04:26

విజయవాడ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వ వార్షిక పద్దు రానున్న ఎన్నికలకు ఓట్లు రాబట్టేందుకు రూపొందించిన ‘గారడీ బడ్జెట్’ అని ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. చివరి బడ్జెట్‌లోనైనా రాష్ట్రానికి తగిన ప్రయోజనకరంగా కాకుండా తీరని అన్యాయం చేసిన ఎన్‌డీఏ ప్రభుత్వ తీరు అన్యాయమన్నారు.

02/02/2018 - 04:23

అమరావతి, ఫిబ్రవరి 1: అందరికీ ఆరోగ్యం అనేదే ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వైద్య రంగంలో సంస్కరణలు చేపట్టి సామాన్య, మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందిస్తున్న రాష్ట్రం దేశంలో మనదేనని అన్నారు. గురువారం ఉదయం ఉండవల్లి నివాసంలోని గ్రీవెన్స్ సెల్ నుంచి టెలి ఆఫ్తమాలజీ సేవలను ఆయన ప్రారంభించారు. రాష్టవ్య్రాప్తంగా 115 ‘ముఖ్యమంత్రి ఐ కేంద్రా’లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

02/02/2018 - 04:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబు పేర్కొన్నారు. ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్‌ద్వారా సమాజంలోని అన్ని వర్గాలవారికి న్యాయం చేకూర్చే విధంగా అన్ని వర్గాలకు సమతూకం పాటించే విధంగా ఉందని చెప్పారు.

02/02/2018 - 04:21

కాకినాడ, ఫిబ్రవరి 1: విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెసర్ కె బాబులును ఎట్టకేలకు కాకినాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో గురువారం విలేఖరుల సమక్షంలో పోలీసులు బాబులును ప్రవేశపెట్టారు.

02/02/2018 - 04:20

నెల్లూరు, ఫిబ్రవరి 1: పోలీసుల కళ్లు గప్పి గత కొనే్నళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠాను నెల్లూరు పోలీసులు గురువారం పట్టుకున్నారు. పట్టుబడిన వారంతా 20పైగా కేసుల్లో నిందితులుగా ఉంటున్న మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లని జిల్లా క్రైం ఓఎస్‌డి విఠలేశ్వర్ తెలిపారు. గురువారం నెల్లూరులో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి స్మగ్లర్ల వివరాలు వివరించారు.

02/02/2018 - 04:20

విజయవాడ, ఫిబ్రవరి 1: మూడు నెలల ముందుగా కసరత్తు.. ఎంపీలతో మొక్కుబడి సమావేశం.. చివరకు కేటాయింపులు మాత్రం నిల్! ఇదీ గత మూడేళ్లుగా విజయవాడ డివిజన్‌కు సంబంధించి రైల్వే బడ్జెట్‌లో జరుగుతున్న అన్యాయం. రాష్ట్ర విభజన తరువాత కీలకంగా మారిన విజయవాడ డివిజన్‌కు సంబంధించి రైల్వే బడ్జెట్‌లో రిక్తహస్తమే చూపారు.

02/02/2018 - 04:18

విశాఖపట్నం, ఫిబ్రవరి 1: కోట్ల రూపాయల అక్రమార్జనతో ఏసీబీకి దొరికిపోయిన కమర్షియల్ టాక్స్ కమిషనర్ లక్ష్మీప్రసాద్ మరిన్ని ఆస్తులను ఏసీబీ అధికారులు గురువారం బయటపెట్టారు. లక్ష్మీ ప్రసాద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు నాలుగున్నర కిలోల బంగారాన్ని విశాఖలోని ఏసీబీ కార్యాలయంలో గురువారం సాయంత్రం మీడియా ముందు ఉంచారు.

02/02/2018 - 04:17

విశాఖపట్నం, ఫిబ్రవరి 1: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో జగన్ నాయకత్వంలో ఢిల్లీలో పోరాటం చేస్తామని వైఎస్సాఆర్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గుడివాడ అమర్ ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో కూడా రైల్వేజోన్‌పై ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆశీలమెట్ట జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు.

Pages