S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/31/2018 - 23:36

విశాఖపట్నం, జనవరి 31: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వత్తిడి, అకస్మాత్తుగా ఉపాధి కోల్పోయి వీధిన పడిన తండ్రి, ఆర్థిక ఇబ్బందులు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు దారితీశాయి. విశాఖ నగరంలో జరిగిన ఈ సంఘటన అందరినీ కలిచివేసింది. స్థానిక లలితానగర్‌కు చెందిన గ్రంథి తేజశ్విని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.

01/31/2018 - 02:58

హైదరాబాద్, జనవరి 30: రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎపి టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2029 నాటికి ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవడం ఖాయమని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.

01/31/2018 - 02:58

విజయవాడ, జనవరి 30: దశాబ్దాలుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీకి లాభాలు లేకపోయినా క్రమేణా నష్టాలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ దాదాపు 4 వేల కోట్ల రూపాయల నికర నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో తొలుత నండూరి సాంబశివరావు, ఆపై ఎం మాలకొండయ్య సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టి అనేకానేక సంస్కరణలు చేపట్టటంతో నష్టాలకు అడ్డుకట్ట పడింది.

01/31/2018 - 02:56

విజయవాడ, జనవరి 30: వచ్చే బడ్జెట్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.290 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య కోరారు. సచివాలయంలోని ఆర్థికశాఖ కార్యాలయంలో మంత్రిని కలిసిన ఆనందసూర్య బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాల అమలుకు 2018-19 బడ్జెట్‌లో రూ.290 కోట్లు కేటాయించాలని కోరారు.

01/31/2018 - 02:56

విజయవాడ, జనవరి 30: రాష్ట్ర శాసన సభ, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌లకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వ్యవహరిస్తున్నారు. వీరికి క్యాబినెట్ హోదా కల్పించారు.

01/31/2018 - 02:55

అమరావతి, జనవరి 30: ఇటీవల ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైన సందర్భంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్ బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర రెడ్డి, కోశాధికారి వీరేంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తదితర ఎన్జీవో నాయకులు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి అభినందనలు తెలియజేశారు.

01/31/2018 - 02:54

గుంటూరు, జనవరి 30: ఇకపై రాజకీయాలకు స్వస్తిచెప్పి శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించినట్లు మాజీగవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్పష్టంచేశారు. తమిళనాడు గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం తొలిసారిగా మంగళవారం గుంటూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాంబాబు నివాసంలో కొద్దిసేపు విలేఖర్లతో మాట్లాడారు. గవర్నర్ పదవి అత్యంత బరువు బాధ్యతలతో కూడుకున్నదన్నారు.

01/31/2018 - 02:54

అమరావతి, జనవరి 30: అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురావడానికి అవసరమైన రూ.969 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబునాయుడికి తనతో పాటు కల్యాణదుర్గం శాసనసభ నియోజకవర్గ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

01/31/2018 - 02:52

విజయవాడ, జనవరి 30: రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ నిలదొక్కోటానికి తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇందుకోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తానన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం డెరెక్టరీ, 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ను చంద్రబాబు నాయుడు తన చాంబర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఆరు మిలీనియమ్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ ఫిలిం డెరెక్టరీని ప్రచురించింది.

01/31/2018 - 02:52

అమరావతి, జనవరి 30: ఈ ఆర్థిక సంవత్సరం చివరి దశకు వచ్చేశామని, ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉన్నందున పనుల వేగం పెంచి ఎస్సీ, ఎస్టీల నిధులు ఖర్చుచేయాలని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ 19వ నోడల్ ఏజెన్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంతో పోల్చితే నిధుల వినియోగంలో కొంత మెరుగుదల కనిపిస్తోందని చెప్పారు.

Pages