S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/15/2018 - 03:56

తిరుపతి, జనవరి 14:ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని తన ఇలవేల్పయిన శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. సంక్రాంతి సంబరాలను తన జన్మస్థలమైన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో కుటుంబ సభ్యులతో కలసి జరుపుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

01/15/2018 - 03:54

శ్రీశైలం, జనవరి 14 : సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లు రావణ వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చక వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.

01/15/2018 - 03:52

చంద్రగిరి, జనవరి 14: తెలుగు వారి జీవితాల్లో భోగి పండుగ ఆనందాన్ని, సుఖ సంతోషాలను నింపాలని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. నారావారి పల్లెలో తన వియ్యంకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి బాలకృష్ణ దంపతులు వచ్చారు. బాలకృష్ణ ఆదివారం ఉదయం ఇంటి ముందు భోగి మంట వేశారు.

01/15/2018 - 03:49

విజయవాడ (ఇంద్రకీలాద్రి) జనవరి 14: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జ్ ఈవో వైవీ అనూరాధ ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది ఆదివారం ఉదయం భోగి మంటలు వేశారు. శనివారం సాయంత్రం భక్తులను ఆద్యంతం ఆకట్టుకునేలా చూడముచ్చటగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు.

01/15/2018 - 03:22

చిత్రాలు..విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లులో బరిలో ఢీకొంటున్న గొర్రెపొట్టేళ్లు
*గొర్రెపొట్టేలును బరి వద్దకు తీసుకొస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ (టీడీపీ), తదితరులు

01/15/2018 - 03:19

విజయవాడ, జనవరి 14: రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల కష్టాలు తీరుతాయన్న ఆకాంక్షను ఆదివారం ఆయన ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్‌లో అమలు చేయబోతున్న ‘్భవంతర్ భగతాన్ యోజన పథకం’ ప్రధాని రైతులకు ఇవ్వబోతున్న సంక్రాంతి కానుకగా భావించవచ్చని తెలిపారు.

01/15/2018 - 03:18

రామచంద్రాపురం, జనవరి 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయాన్ని పండుగచేసి చూపించారని వైఎస్‌ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

01/15/2018 - 03:17

విజయవాడ, జనవరి 14: ప్రభుత్వానికి గుండెకాయ వంటి రాష్ట్ర ట్రెజరీ శాఖలో దొంగలు పడిన ఏడాది కాలం తర్వాత మేలుకున్న ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే ఉన్నతాధికారులు ఆదిలోనే కళ్లు తెరచి ఉంటే వందల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ సొమ్ము నిలువుదోపిడీకి గురయ్యేది కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పోలీసు కేసులు నమోదు కాగా, బాధ్యులు కొందరు సస్పెన్షన్‌కు గురయ్యారు.

01/15/2018 - 03:16

ఒంగోలు, జనవరి 14 : వైకాపా ఒక మునిగి పోయే నావ వంటిందని, జగన్ పాదయాత్ర పూర్తి అయ్యే లోపు పార్టీ ఖాళీ కావడం ఖాయమని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఐఐటికి విద్యార్థుల ఏర్పాట్ల కోసం ఒంగోలు దగ్గరలోని ఏడుగుండ్లపాడు వద్ద పరిశీలనలో ఉన్న నిమ్రా కళాశాల భవనాలను ఆయన ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు.

01/15/2018 - 03:16

అమరావతి, జనవరి 14: కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలు సాధించే దిశగా ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే అడుగడుగునా అడ్డుపడేందుకు తల్లీ పిల్ల కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, భూమా అఖిలప్రియ విమర్శించారు.

Pages