S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/10/2018 - 00:12

విజయవాడ, జనవరి 9: రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కాలానికి రూపొందించిన నూతన కల్లు విధానంతో రాష్ట్రంలోని కల్లు గీత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ కల్లుగీత కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. నూతన కల్లు పాలసీపై ప్రభుత్వం జీవో నెం.11 జారీ చేసిందన్నారు.

01/10/2018 - 00:11

విజయవాడ, జనవరి 9: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో అధికారులు, నేతలు ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు.

01/10/2018 - 00:11

అమరావతి, జనవరి 9: సచివాలయంలో నోరూరించే వంటకాల విందు ఉద్యోగులను అలరింపచేసింది. పర్యాటక శాఖ ఈ పసందైన వంటకాలను అందించింది. పోషక విలువలు కలిగిన సాంప్రదాయ తెలుగు వంటకాల ప్రాచుర్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు.

01/10/2018 - 00:10

విజయవాడ, జనవరి 9: జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంపై అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు.

01/09/2018 - 04:29

హైదరాబాద్, జనవరి 8: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న దేశ వ్యాప్తంగా లెజెండరీ రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.

01/09/2018 - 04:21

తాళ్లపూడి, జనవరి 8: ప్రకృతి వనరుల ద్వారా సంపదను సృష్టించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గాలి, నీరు, సూర్యరశ్మిని వినియోగించి సంపదను సృష్టిస్తామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే పటిష్ట ప్రణాళిక రూపొందిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

01/09/2018 - 04:16

మంగళగిరి, జనవరి 8: అఖిల విశ్వగాయత్రి పరివార్ , శాంతికుంజ్ హరిద్వార్ ఆధ్వర్యాన గుంటూరుజిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై వైద్య కళాశాల ప్రాంగణంలో ఈనెల 5వ తేదీ నుంచి నిర్వహించిన అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం సోమవారం వైభవోపేతంగా ముగిసింది. దేశ విదేశాల నుంచి నాలుగు రోజుల్లో లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో యజ్ఞం అంగరంగ వైభవంగా జరిగి సుసంపన్నమైంది. చివరి రోజున పూర్ణాహుతితో పరిసమాప్తమైంది.

01/09/2018 - 04:14

గుంటూరు, జనవరి 8: రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతనిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయనే అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లపై హైడ్రామా నెలకొంది.

01/09/2018 - 04:11

కొవ్వూరు, జనవరి 8: పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తిచేయాలనే డిమాండుతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహా పాదయాత్ర రెండో రోజైన సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగింది. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొన్న నేతలు కొవ్వూరులో రాత్రి బసచేశారు. సోమవారం ఉదయం కొవ్వూరు నుండి బయలుదేరిన కాంగ్రెస్ నేతల పాదయాత్ర దొమ్మేరు, కాపవరం మీదుగా ధర్మవరం చేరింది.

01/09/2018 - 03:41

మచిలీపట్నం, జనవరి 8: బందరు ఓడరేవు నిర్మాణానికి నేను సిద్ధంగానే ఉన్నా. మీ ప్రాంత అభివృద్ధికి దోహదపడే పోర్టు కోసం మీరు కూడా ముందుకు రావాలి. రైతులకు శాశ్వత ప్రయోజనం కల్పించేందుకు భూసమీకరణ ద్వారా భూములను తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ కొంత మంది భూసేకరణ ద్వారా ఇస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా భూసేకరణ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాను.

Pages