S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/18/2017 - 00:36

విశాఖపట్నం, డిసెంబర్ 17: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో నెలకొల్పేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు పార్టీ ఏపీ కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి మొహిద్దీన్ బేగ్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వంలో ఉన్న తమ పార్టీ యూపీ, మణిపూర్, త్రిపురలో కూడా రాజకీయంగా ప్రభావాన్ని చూపుతోందన్నారు.

12/17/2017 - 04:42

విజయవాడ, డిసెంబర్ 16: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకటరావు నేతృత్వంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ టిడి జనార్ధన్, కర్నూలు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు శనివారం సమావేశమయ్యారు. శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక జరుగనుంది.

12/17/2017 - 04:42

విశాఖపట్నం, డిసెంబర్ 16: రైల్వేజోన్ మన హక్కని, అది వచ్చే వరకు తమ ప్రయత్నం ఆగదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖ వుడాపార్కులో శనివారం హెలీ టూరిజాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ తప్పక రావాలని, ఇది వచ్చేవరకు ప్రయత్నం ఆగదన్నారు. తాము చేయాల్సిందంతా చేసామని, ఇక రాజకీయ నిర్ణయమే మిగిలి ఉందని కేంద్రం చెప్పిందన్నారు.

12/17/2017 - 04:40

కర్నూలు, డిసెంబర్ 16: దేశవ్యాప్తంగా పులులను లెక్కించే కార్యక్రమం జనవరి మొదటివారం నుంచి ప్రారంభమవుతుందని అటవీ అధికారులు తెలిపారు. పులుల గణనలో అటవీ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుందని వారు తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్ పులుల అభయారణ్యం రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది.

12/17/2017 - 04:24

ఎమ్మిగనూరు, డిసెంబర్ 16: పోలవరం ప్రాజెక్టును నిర్మించే సామర్థ్యం రాష్ట్రానికి లేదని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు పురంధ్రీశ్వరి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శనివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ప్రచారం చేయడం తగదని అన్నారు.

12/17/2017 - 04:24

ధర్మవరం, డిసెంబర్ 16: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి పార్టీ అభివృద్ధిపైనే సీఎం దృష్టి సారించారన్నారు. ప్రజా సంకల్పయాత్ర 36వ రోజు శనివారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో కొనసాగింది.

12/17/2017 - 04:23

పొన్నూరు, డిసెంబర్ 16: కుటుంబ కలహాల నేపథ్యంలో మనోవేదనకు గురైన గృహిణి తన ఇద్దరు పసిపాపలు సహా తనపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషాద ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాటిపర్రులో శనివారం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదేళ్ల పసిపాప మృతిచెందగా, తల్లి, మరో పాప ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం...

12/17/2017 - 04:23

విజయవాడ, డిసెంబర్ 16: ట్రెజరీ శాఖలో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిబ్బందితో కుమ్మక్కయి మరణించిన వారి పెన్షన్‌ను లక్షల రూపాయల మేర ఏళ్ల తరబడి స్వాహా చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

12/17/2017 - 04:22

ఒంగోలు, డిసెంబర్ 16: రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, బయట కూడా ఉద్యమాలు చేస్తామని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం ఒంగోలులో మీడియాతో మాటాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనకోసం అవసరమైతే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని తెలిపారు.

12/17/2017 - 04:21

విశాఖపట్నం, డిసెంబర్ 16: విద్యతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుందని, ప్రంపంచానికి మేలు చేకూర్చే ఆలోచనలు రూపకల్పన చేసేందుకు ఈ సదస్సు వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యునెస్కో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఎంజీఐఈపీ), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న టెక్-2017 సదస్సును శనివారం విశాఖలో ప్రారంభించారు.

Pages