S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/16/2017 - 03:07

రాజమహేంద్రవరం, డిసెంబర్ 15: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు పదేళ్లయినా పరిహారం పూర్తిగా అందని పరిస్థితి నేటికీ కొనసాగుతోంది. పోలవరం హెడ్ వర్క్సులో భాగంగా అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపువున్న మొదటి విడత ముంపు గ్రామాల నిర్వాసితులను పదేళ్లుగా ఖాళీచేయించడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారు.

12/16/2017 - 02:58

విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: ఏపీ డీజీపీ నియామకం విషయంలో కేంద్రంతో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం జరుగనున్నట్టు తెలిసింది. ప్రస్తుతమున్న డీజీపీ నండూరి సాంబశివరావు ఈనెల 31వ తేదీతో పదవీ విరమణ పొందనున్నారు.

12/16/2017 - 01:23

నెల్లూరు, డిసెంబర్ 15: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏసిబి కార్యాలయాలకు జూన్ నెలాఖరులోగా సొంత భవనాలు ఏర్పాటు చేస్తున్నామని ఏసిబి డిజి ఆర్.పి. ఠాకూర్ తెలిపారు. శుక్రవారం నెల్లూరులో జరుగుతున్న ఏసిబి డి ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మొత్తం 13 జిల్లా కేంద్రాల్లో ఏసిబి కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.

12/16/2017 - 01:22

ఒంగోలు, డిసెంబర్ 15: ప్రకాశం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ జడ్పీ వెబ్‌సైట్ ప్రారంభించి పలువురు దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేసిన 11 మంది వ్యక్తులను శుక్రవారం నాడు మార్కాపురం పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం 31లక్షల 75వేల రూపాయల నగదు , నకిలీ రబ్బరు స్టాంపులు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు తెలిపారు.

12/16/2017 - 01:22

విజయవాడ, డిసెంబర్ 15: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ స్థితిగతులను స్వయంగా తెలుసుకునేందుకు సీపీఐ ప్రతినిధి బృందం శనివారం ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించనుంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర నిధులతో పూర్తిచేస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ నిర్మాణం విషయంలో ఇంత గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఎవరనే విషయమై సీపీఐ బృందం అధ్యయనం చేయనుంది.

12/16/2017 - 01:21

ప్రత్తిపాడు, డిసెంబర్ 15: కాపుల జనాభా ఆధారంగా 11-12 శాతం కల్పించాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం డిమాండ్‌చేశారు. కేవలం అయిదుశాతం రిజర్వేషన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం సమంజసంగా లేదన్నారు. ఈ మేరకు ముద్రగడ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒక లేఖ రాశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో లేఖ ప్రతులను శుక్రవారం విడుదల చేశారు.

12/16/2017 - 03:58

అమరావతి, డిసెంబర్ 15: పర్యాటకశాఖ చేసిన ప్రత్యేక కృషి ఫలితంగా విశాఖ నగరానికి ఈ-వీసా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఈ మేరకు కేంద్ర అంతరంగిక శాఖ సమాచారం అందించిందని శుక్రవారం వెల్లడించారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులకు ఉపయోగకరమని, రాష్ట్రంలో ఈ తరహా సౌకర్యం పొందిన తొలి విమానాశ్రయం విశాఖపట్నం మాత్రమేనన్నారు.

12/16/2017 - 01:01

అమరావతి, డిసెంబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక గ్రామాలపై దృష్టి సారించనున్నారు. జనవరి 3 నుంచి పదిరోజుల పాటు జరిగే జన్మభూమి కార్యక్రమాలు దీనికి వేదిక కానున్నాయి. మొత్తం పది రోజుల్లో పది జిల్లాలు పర్యటించే చంద్రబాబు, రోజుకో గ్రామానికి వెళ్లనున్నారు. అంతకంటే ముందుగానే ప్రతి గ్రామానికీ ఒక యాక్షన్‌ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

12/16/2017 - 01:00

విజయవాడ, డిసెంబర్ 15: చాలాకాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణలను రిజిస్ట్రేషన్ల శాఖలో ఎట్టకేలకు అమలుచేయనున్నారు. దళారీల వ్యవస్థను నియంత్రించటమే లక్ష్యంగా ఈ సంస్కరణలను తీసుకొచ్చినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. ఇకపై ఎన్‌కంబరెన్స్ సర్ట్ఫికెట్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీలు కావాలంటే రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

12/16/2017 - 00:59

విజయవాడ, డిసెంబర్ 15: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నతాధికారులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మరింత మెరుగైన పాలన అందిచే వీలు ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

Pages