S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/22/2017 - 03:43

విజయవాడ(బెంజిసర్కిల్), నవంబర్ 21: సంక్షోభంలో ఉన్న రైతాంగానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించి, తామున్నామన్న భరోసాను కల్పించి, వారిలో మనోధైర్యాన్ని నింపగలిగామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అన్నదాతను నిరుత్సాహ పరిచేవిధంగా ప్రతిపక్షనేత జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతుల్లో ఎనలేని అనందం ఉందన్నారు.

11/22/2017 - 03:42

అమరావతి, నవంబర్ 21: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో ఆయనపై పోటీచేసి ఓడిన వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహించిన సభ్యులు.. అంబటికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని సూచించడంపై, తెలుగుదేశం పార్టీ సభ్యుల్లో విభిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

11/22/2017 - 03:41

విజయవాడ, నవంబర్ 21: చరిత్రకు చిత్రిక పట్టి భవిష్యత్తు తరాలకు తెలియజేయడంలో ఫొటోగ్రఫీ పాత్ర ఎనలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

11/22/2017 - 03:39

విజయవాడ, నవంబర్ 21: దాదాపు 70 ఏళ్లుగా క్రయ విక్రయాలతో లక్షలాది మంది ప్రజలు అనుభవిస్తూ వస్తున్న హిందూ దేవాలయాలకు చెందిన ఇనామ్ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చి ఏడాది కాలంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయటమే గాక సంబంధిత భూములన్నింటినీ స్వాధీనపర్చుకోటానికి దేవాదాయశాఖ అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.

11/22/2017 - 03:38

విజయవాడ, నవంబర్ 21: విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలోని ఎన్‌సిఎస్ షుగర్స్ కంపెనీ యాజమాన్యం చెరకు రైతులకు చెల్లించాల్సిన ఒక కోటీ 97 లక్షల రూపాయల బకాయిలను తక్షణం చెల్లించాలంటూ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్.అమరనాధ్‌రెడ్డి, ఆ జిల్లాకు చెందిన భూగర్భ గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ వెంకట రంగారావు చెరకు కమిషనర్ ఎల్.మురళి, ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరక్టర్ ఎన్.నాగేశ్వరరావును ఆదేశించారు.

11/21/2017 - 04:00

గుంటూరు, నవంబర్ 20: నేను ఎక్కడా రాజీపడను.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు.. హేతుబద్ధతలేదు.. అయినా కష్టాలను అధిగమిస్తున్నాం.. ప్రత్యేక హోదా డిమాండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉంది.. అది కష్టసాధ్యం..కేంద్రం అందుకు తగిన ప్యాకేజీ ప్రకటించింది..

11/21/2017 - 03:58

విశాఖపట్నం, నవంబర్ 20: నిర్దిష్ట గడువులోగా తెలుగు భాష అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని చాటుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. తెలుగు దండు ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట గత 20 రోజులుగా జరుగుతున్న నిరసన దీక్షలో సోమవారం ఆయన పాల్గొన్నారు.

11/21/2017 - 03:57

పుట్టపర్తి, నవంబర్ 20: ధర్మస్థాపనకు వేదం మార్గమని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. భగవాన్ సత్యసాయి బాబా 92వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పుట్టపర్తిలో జరిగిన అంతర్జాతీయ వేద సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ ప్రసంగిస్తూ వేదాలకు భారతదేశం పుట్టినిల్లు అన్నారు. భిన్న సంస్కృతులు, భిన్న మతాలకు భారతదేశం నిలయమన్నారు.

11/21/2017 - 03:52

తిరుపతి, నవంబర్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం రాత్రి అమ్మవారు గరుడ సేవ వైభవంగా జరిగింది. గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు.

11/21/2017 - 03:50

అమరావతి, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఈ స్థాయిలో విమర్శలు వస్తాయని భావించలేదని సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు వస్తాయనుకుంటే ఐవీఆర్‌ఎస్‌తో సర్వే చేయించి ఉండేవాళ్లమన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన వ్యూహబృందంతో సోమవారం నిర్వహించిన సమావేశంలో నంది అవార్డుల ప్రస్తావన వచ్చింది.

Pages