S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/17/2017 - 00:19

విజయవాడ, నవంబర్ 16: దేశానికి రైతే వెనె్నముక.. రైతు సంక్షేమ తమ ధ్యేయం అంటూ పదేపదే చెప్పే పాలకులకు కనీస మద్దతు ధర నిర్ణయించే సమయంలో మాత్రం ఆ మాటలు గుర్తుకు రావన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవ ఉత్పత్తి ఖర్చును దృష్టిలో ఉంచుకుని రైతుకు మేలు చేసేలా మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి.

11/17/2017 - 00:18

విజయపురిసౌత్, నవంబర్ 16: శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి నీటి విడుదల గురువారం పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 572 అడుగులకు చేరుకుంది. ఇది 261.5900 టీఎంసీలకు సమానం. తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం కుడికాలువకు 9104, ఎడమ కాలువకు 4223, ఎస్‌ఎల్‌బిసికి 1800 క్యూసెక్కులు మొత్తం అవుట్‌ఫ్లోగా 15127 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

11/17/2017 - 00:17

విజయవాడ, నవంబర్ 16: కృష్ణానది పవిత్ర సంగం వద్ద బోటు బోల్తా ఘటన నేపథ్యంలో బోటింగ్ ఆపరేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పర్యాటక, ప్రయాణికుల, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్‌కు సంబంధించి బోటింగ్ ఆపరేషన్లకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

11/17/2017 - 00:17

గుంటూరు, నవంబర్ 16: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ మార్కెటింగ్ విధానం బాలారిష్టాలను అధిగమించి సత్ఫలితాలను ఇస్తోంది. గుంటూరు మిర్చి యార్డులో పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియ అమలు జరుగుతోంది. దీనివల్ల ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో మిర్చి ధరల విషయమై రైతులకు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు అందుతన్నాయి. దీంతో ధరల్లో హెచ్చు తగ్గులకు అనుగుణంగా రైతులు సరకును విక్రయిస్తున్నారు.

11/17/2017 - 00:16

విజయవాడ, నవంబర్ 16: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించినవే కాకుండా వివిధ ప్రాజెక్టు పనులకు సంబంధించి కూడా సాలీనా వేలాది కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగే ట్రెజరీ కార్యాలయాల పట్ల ఆర్థికశాఖ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ట్రెజరీ కార్యాలయాల ద్వారా వందల కోట్ల రూపాయల మేర అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి.

11/16/2017 - 23:36

పుట్టపర్తి, నవంబర్ 16: పుట్టపర్తి సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18న వేణుగోపాలస్వామి రథోత్సవంతో జయంతి వేడుకలు ప్రారంభమవుతాయి. 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20, 21 తేదీల్లో సత్యసాయి అంతర్జాతీయ వేద సమ్మేళనం నిర్వహిస్తారు. 22న డీమ్డ్ యూనివర్శిటీ 36వ స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగిస్తారు.

11/16/2017 - 23:35

విశాఖపట్నం, నవంబర్ 16: మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ ధనవంతుల్లో ఒకరు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సృష్టికర్త బిల్‌గేట్స్ శుక్రవారం విశాఖకు వస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా బిల్‌గేట్స్ అడుగుపెట్టనున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి చంద్రబాబుకు సహకరించిన బిల్‌గేట్స్ వ్యవసా రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి కూడా చేయూతనందించనున్నారు.

11/16/2017 - 23:34

అనంతపురం, నవంబర్ 16: రాష్ట్రంలో బాల్య వివాహాలు జరగకూడదని, వాటిని ప్రోత్సహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. గురువారం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. తాడిపత్రికి చెందిన నాగరత్నమ్మ ఆడబిడ్డకు జన్మనివ్వగా పాపకు అమరావతి అని నామకరణం చేశారు.

11/16/2017 - 23:33

విజయవాడ, నవంబర్ 16: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా సింగపూర్‌లో అమరావతి పార్టనర్‌షిప్ ఆఫీస్ (ఏపీఓ)ను ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అమరావతిలో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ తదితర అంశాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఈ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. ఇది అమరావతి అభివృద్ధిలో మరో మైలురాయిగా చెప్పవచ్చు.

11/16/2017 - 01:59

అమరావతి, నవంబర్ 15: అనుకున్నదే అయింది. అంతా ఊహించిందే జరిగింది. రాష్ట్రాన్ని కుదిపేసిన బోటు బోల్తా విషాదంపై ప్రాథమిక దర్యాప్తు చేసిన సర్కారు, పెద్ద గద్దలను వదిలి చిరు చేపలపైనే వేటు వేసింది.

Pages