S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/22/2017 - 03:59

కర్నూలు, అక్టోబర్ 21 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. ఆయన ఏదో ఒకరోజు తమ పార్టీలో చేరడం ఖాయమన్న గంపెడాశతో ఆపార్టీ నేతలు ఉన్నారు. చాలాకాలంగా పార్టీ మారుతున్నారని వస్తున్న ప్రచారాన్ని కోట్ల ఖండిస్తూ వస్తున్నారు. పార్టీ వీడే ప్రశక్తేలేదని ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రచారం మాత్రం ఆగడం లేదు.

10/22/2017 - 03:57

ఆదోని, అక్టోబర్ 21: అరటి నార, ఖాదీ నూలుతో ప్రయోగాత్మకంగా వస్త్రాలు తయారు చేసినట్లు ఖాదీ గ్రామీణ పరిశ్రమల దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ చైర్మన్ చంద్రవౌళి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మహారాష్టల్రోని జల్గాం పట్టణంలో అరటి నార, ఖాదీనూలు కలిపి వస్త్రాన్ని తయారు చేశామన్నారు. త్వరలోనే మార్కెటెలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

10/22/2017 - 03:55

విశాఖపట్నం, అక్టోబర్ 21: ఏడు దశాబ్దాలుగా అమలవుతున్న రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌ను శనివారం ప్రారంభించారు.

10/22/2017 - 03:54

పీలేరు, అక్టోబర్ 21: చిత్తూరుజిల్లా పీలేరు అటవీశాఖ రేంజ్ పరిధిలో రొంపిచెర్ల బీటు పరిధిలో కమ్మోళ్లకొండ అటవీప్రాంతంలో ఒక ఆడ చిరుతపులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మరణించిందని పీలేరు అటవీక్షేత్ర అధికారి రామ్‌లా నాయక్ తెలిపారు.

10/22/2017 - 03:53

నరసరావుపేట, అక్టోబర్ 21: వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. తొలుత నరసరావుపేటలో ఆలయాలు, మసీదు, చర్చిలను సందర్శించి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు.

10/22/2017 - 03:51

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆంధ్రాలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని వైకాపా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ విష జ్వరాలుప్రబలి లక్షలాది మంది మంచాన పడ్డారని, ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారన్నారు.

10/22/2017 - 03:26

విజయవాడ, అక్టోబర్ 21: మీరు డబ్బులు వెచ్చించాలని అడగడం లేదు.. మీ ప్రాంత అభివృద్ధి కోసం తగిన సలహాలు, ఉత్తమ పద్ధతులు, సాంకేతికతను తీసుకురండి.. నిధుల కంటే ఆలోచనలు అత్యంత ముఖ్యం.. ప్రభుత్వం గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని వౌలిక వసతులను కల్పిస్తుంది.. ప్రభుత్వానికి సహకరించడమే మీ పని.. నాయకత్వం వహించి మీ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం ఇవ్వండి..

10/22/2017 - 03:24

విజయవాడ (రైల్వేస్టేషన్), అక్టోబర్ 21: రైళ్లలోని అన్ని కార్యాలయాల్లోని విభాగాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుపరచాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

10/22/2017 - 03:24

విజయవాడ, అక్టోబర్ 21: 2018 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన 11వ పే రివిజన్ కమిషన్‌ను తక్షణం ఏర్పాటుచేయాలని స్థానిక ఎన్‌జివో హోంలో శనివారం జరిగిన ఎపి ఎన్‌జివో సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు అధ్యక్షత వహించారు.

10/22/2017 - 03:22

విజయవాడ, అక్టోబర్ 21: ఆరు రోజుల పర్యటనకోసం పురపాలక మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం రాత్రి బయలుదేరి దుబాయ్ చేరుకున్నారు. శనివారం ఉదయం అక్కడ మరో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి దుబాయ్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి రోడ్లు, భవనాలు, బ్రిడ్జిల నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. అక్కడి అధికారులతో నిర్మాణాల సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు.

Pages