S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/07/2016 - 15:29

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో అరెస్టు చేసిన అయిదుగురి వివరాలను సిఐడి పోలీసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. వీరిని కాకినాడ కోర్టులో హాజరు పరిచారు. నిందితుల పేర్లు: దూడల మహేంద్ర(అమలాపురం) , కూరాకుల దొరబాబు(పిఠాపురం) , మహేష్‌ (గుంటూరు), పవన్‌కుమార్‌(గుంటూరు) , నక్కా సాయి(తూర్పుగోదావరి).

06/07/2016 - 15:27

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి ఆరుగురిని అమలాపురం పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్‌లో బైఠాయించిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను పోలీసులు కిర్లంపూడికి తరలించారు. కేసులు రైల్వేశాఖ పరిధిలో ఉన్నాయని చెబుతున్న స్థానిక పోలీసులు అరెస్టులు ఎలా చేస్తారని ముద్రగడ స్థానిక డిఎస్పీతో వాదనకు దిగారు. అరెస్టు చేసినవారిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

06/07/2016 - 15:25

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో నిందితులకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయని సిఐడి పోలీసులు మంగళవారం మీడియాకు వివరించారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధమైనపుడు వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నామని వారు తెలిపారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన దూడల మణీంద్ర అమలాపురంలో రౌడీషీటర్ అని సీఐడీ తేల్చింది.

06/07/2016 - 15:22

కాకినాడ: రాజకీయ కక్షలతో విపక్షపార్టీల కార్యకర్తలను తుని విధ్వంసకాండలో నిందితులుగా పేర్కొంటూ అరెస్టులు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంగళవారం ఆరోపించారు. ఈ రోజు సిఐడి పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో ఇద్దరు అమాయకులున్నారని ఆయన అన్నారు. తుని వద్ద విధ్వంసం జరిగినపుడు ఆ ఇద్దరు ఆ ప్రాంతంలోనే లేరని తెలిపారు.

06/07/2016 - 12:30

విశాఖ: ఇక్కడి రామకృష్ణా బీచ్ వద్ద మంగళవారం ఉదయం సముద్రం ముందుకు వచ్చింది. తీరంలోని సబ్ మెరైన్ మ్యూజియంను అలలు తాకుతున్నాయి. వైఎంసిఎ వైపు సుమారు 50 అడుగుల మేరకు సముద్రం ముందుకు చొచ్చుకుని రావడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ఇటీవలి కాలంలో సముద్రం ముందుకు రావడం, బీచ్ కోతకు గురికావడంతో శాస్తవ్రేత్తలు కొంతకాలంగా అధ్యయనం చేస్తున్నారు.

06/07/2016 - 12:29

అనంతపురం: చేనేత కార్మికులకు భారీగా బకాయిలు పడిన కేసులో కళానికేతన్ వస్తద్రుకాణం ఎండి లక్ష్మీశారదకు ధర్మవరం కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఆమెను మంగళవారం ధర్మవరం కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. తమ వద్ద పట్టుచీరలు తీసుకుని 9 కోట్ల రూపాయలు బకాయి పడడంతో లక్ష్మీశారదపై స్థానిక చేనేత వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

06/07/2016 - 12:28

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తునిలో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి సిఐడి పోలీసులు మంగళవారం నాడు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. సిసి టీవీ ఫుటేజి, వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా, తనను అరెస్టు చేయాలంటూ అమలాపురం పోలీస్ స్టేషన్‌లో హంగామా సృష్టిస్తున్న కాపు ఉద్యమనేతతో చర్చలు జరపాలంటూ తూ.గో. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

06/07/2016 - 12:04

విజయవాడ: నదీ జలాల వాటాలో అన్యాయం జరిగిందంటూ తెలంగాణ నేతలు దేశ రాజధానిలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. బచావత్ అవార్డు ప్రకారమే ఎపి, తెలంగాణలకు నీటిని కేటాయిస్తున్నారన్నారు. విభజన చట్టానికి నాడు అంగీకరించిన టి.నేతలు ఇపుడు కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలను అంగీకరించమంటూ ప్రకటనలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

06/07/2016 - 11:58

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి తాజాగా అరెస్టు చేసిన నిందితుల వివరాలను ఎపి సిఐడి పోలీసులు బహిర్గతం చేయడం లేదు. పదిమందిని అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నా సిఐడి అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కడప, గుంటూరు జిల్లాల్లో కూడా నిందితులను గుర్తించినట్లు సమాచారం. నేడో, రేపో మరో 20 మందిని అరెస్టు చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

06/07/2016 - 11:57

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి కొంతమంది నిందితులను అరెస్టు చేయడంతో తనను కూడా అరెస్టు చేయాలంటూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. ఆయన అనుచరులు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకున్నారు. స్థానిక పోలీసులు జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నారు.

Pages