S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/19/2017 - 00:20

విజయవాడ, అక్టోబర్ 18: రాజధాని అమరావతిలో నిర్మించనున్న ఐకానిక్ భవనాలు హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ డిజైన్లకు సంబంధించి 13 ఫొటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్లలో ప్రభుత్వం పోస్టు చేసింది. గతంలో జైకా సంస్థ రూపొందించిన డిజైన్లపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. డిజైన్లపై ప్రజల అభిప్రాయాలను ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

10/19/2017 - 00:19

విజయవాడ, అక్టోబర్ 18: కియా మోటార్స్ ప్రాజెక్టును ఏపి రాష్ట్రం దక్కించుకున్నందుకు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్ అమరనాథ్‌రెడ్డిని దక్షిణ కొరియాలో భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి అభినందించారు.

10/18/2017 - 23:48

చోడవరం, అక్టోబర్ 18: విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న ర్యాగింగ్, చదువులో ఒత్తిడిలు నియంత్రించకుంటే ఆయా కళాశాలల యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో బుధవారం జరిగిన టిడిపి నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరై అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. చదువు విషయంలో పిల్లల సామర్థ్యాన్ని బట్టీ తల్లిదండ్రుల ఆలోచనలు ఉండాలని సూచించారు.

10/18/2017 - 23:47

విజయవాడ, అక్టోబర్ 18: ఈ నెల 2న గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పిఎంజెజెబివై చంద్రన్న బీమా పథకంతో ప్రజలకు సాంఘిక భద్రత, పేద కుటుంబాలకు భరోసా వచ్చిందని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని కార్మిక శాఖ కార్యాలయంలో అధికారులతో పిఎంజెజెబివై చంద్రన్న బీమా పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు.

10/18/2017 - 23:19

రావులపాలెం, అక్టోబర్ 18: దేశీయ వంటకాల్లో, అందునా మసాలా వంటకాలు, ఛాట్ వంటి అల్పాహారాల్లో తదితరాల్లో తప్పనిసరిగా వినియోగించే కొత్తిమీర ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. అసలు మార్కెట్‌లో కొత్తిమీర లభ్యతే తగ్గిపోయి ‘కొద్దిమీర’గా మారిపోయిందంటే అతిశయోక్తికాదు. ఆకుకూరల్లో తక్కువ ధరలో లభించే కొత్తిమీర ధర ప్రస్తుతం దాదాపు పదిరెట్లు పెరిగింది.

10/18/2017 - 23:18

గోరంట్ల, అక్టోబర్ 18: అనంతపురం జిల్లాలో ఆంత్రాక్స్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా బుధవారం గోరంట్లకు చెందిన ఇద్దరికి వ్యాధి సోకింది. మంగళవారం గోరంట్ల మండలంలోని చెట్లమొరంపల్లికి చెందిన ముగ్గురికి వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. వీరు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా గోరంట్లకు చెందిన షహరి, మహబూబ్‌బాషా శరీరంపై బొబ్బలు వచ్చాయి. దీంతో వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

10/18/2017 - 23:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అవినీతికి పాడిఆవులా వాడుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి హడావుడిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడానికి నాగ్‌పూర్ ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు.

10/18/2017 - 23:17

విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం 1వ బ్లాక్‌లోని సిఎస్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులతో గంజాయి సాగు నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

10/18/2017 - 23:16

తెలంగాణ-ఏపి
కేడర్‌కు నాయకత్వం ఆదేశం
ఇరు రాష్ట్రాల నేతలతో లోకేష్ చర్చ
రేవంత్ ఆంధ్రాలో పనులు చేసుకోలేదా?
మీరే ప్రోత్సహించారన్న తెలంగాణ నేతలు
రేవంత్ ఆరోపణలపై ఏపిలో కలకలం
రేవంత్‌కు వ్యతిరేకంగా పరిటాల పోస్ట్
నేడు హైదరాబాద్‌లో నేతలతో లోకేష్ భేటీ?

10/18/2017 - 23:15

భీమవరం, అక్టోబర్ 18: స్వచ్చ సర్వేక్షణ-2018కి ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పురపాలక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పురపాలక సంఘాలు స్వచ్ఛత సాధించే పనిలోపడ్డాయి. 2019 అక్టోబర్ 2 నాటికి దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, పల్లెలు కూడా పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంగా కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. స్వచ్చ సర్వేక్షణ-2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి ప్రతిభనే కనబర్చింది.

Pages