S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/18/2017 - 04:18

అమరావతి, అక్టోబర్ 17: తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయి, తనతో కలసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళదామన్న ఆలోచన చాలామందికి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వారు బయటకు రాలేకపోతున్నారని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్భ్రావృద్ధి కోసం అందరూ తనతో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

10/18/2017 - 04:17

విశాఖపట్నం, అక్టోబర్ 17: విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 113 కోట్ల రూపాయలతో విశాఖలో రోటరీమోడ్ సెపరేటర్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న రెండస్థుల ఫ్లైఓవర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వంతెనను 18 నుంచి 24 నెలల్లో నిర్మించాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

10/18/2017 - 04:15

విజయవాడ/నూజివీడు, అక్టోబర్ 17: కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల మరణాలు, అధ్యాపకుల సమ్మె సంఘటనలపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు, అధికారులతో ఆర్టీయూకెటి వైస్ చాన్సలర్ రామచంద్రరాజు మంగళవారం సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు ట్రిపుల్ ఐటి అధ్యాపకులతో ఆయన సమావేశమై చర్చలు జరిపారు.

10/18/2017 - 04:13

విజయపురిసౌత్, అక్టోబర్ 17: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు పోటెత్తుతోంది. శ్రీశైలం క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేయటంతో సాగర్ జలాశయానికి వరదనీటి ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం రాత్రికి సాగర్ జలాశయం నీటిమట్టం 558.50 అడుగులకు చేరింది. ఇది 238.3125 టిఎంసిలకు సమానం. నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

10/18/2017 - 04:12

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 17: పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడితేనే సకాలంలో పూర్తవుతుందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

10/18/2017 - 02:41

గోరంట్ల, అక్టోబర్ 17: అనంతపురం జిల్లాలో ముగ్గురికి ఆంత్రాక్స్ వ్యాధి సోకింది. నాలుగు రోజుల క్రితం ఆంత్రాక్స్ బారిన పడి సుమారు 50 గొర్రెలు, మేకలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆంత్రాక్స్ బారినపడిన గొర్రెల మాంసం తిన్న ముగ్గురి శరీరంపై బొబ్బలు వచ్చాయి. గోరంట్ల మండలం చెట్లమొరంపల్లిలో ఇప్పటికే ఆంత్రాక్స్ వ్యాధి సోకి 50 గొర్రెలు, మేకలు మృతి చెందిన విషయం తెలిసిందే.

10/18/2017 - 02:40

బెళగుప్ప, ఉరవకొండ, అక్టోబర్ 17 : అనంతపురం జిల్లాలో మంగళవారం మళ్లీ భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని బెళగుప్ప మండలం జీడిపల్లి, ఉరవకొండ మండలంలోని మైలారంపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 3.59 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. పెద్దశబ్ధం రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్ద శబ్దంతో భూమి ఒక్కసారిగా కదలడంతో ఏం జరుగుతుందోనని జనం భయాందోళనకు గురయ్యారు.

10/18/2017 - 02:39

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆంధ్ర రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజీల యాజమాన్యాలపై రాష్ట్రప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. విద్యార్ధుల ఆత్మహత్యల పరంపర సాగుతున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని, తక్షణమే మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

10/18/2017 - 02:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాల కేసు విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఏన్జీటీ) విచారణను నవంబరు 23కి వాయిదా వేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఏన్జీటీలో దాఖలైన పిటిషన్‌ను ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వాతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

10/18/2017 - 02:38

భీమవరం, అక్టోబర్ 17: రాష్టవ్య్రాప్తంగా వెనుకబడిన తరగతుల (బిసి) చైతన్య సదస్సులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. పార్టీ అనుబంధ ఒబిసి మోర్చా ఆధ్వర్యంలో చైతన్య సదస్సులను ఏర్పాటుచేయనున్నట్లు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్ చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి జిల్లాల వారీగా సదస్సులు జరుగుతాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

Pages