S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/18/2017 - 02:38

తిరుపతి, అక్టోబర్ 17: రాష్ట్రంలో 5.40 లక్షల గృహాలు మంజూరయ్యాయని, ఇళ్లులేనివారికి స్థలం, ఇంటిపట్టా ఇచ్చి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి అన్ని వసతులతో కూడిన గృహాలను అందరికి సమానంగా ఉండే విధంగా నిర్మించడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ గృహనిర్మాణ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాలవలవన్ వెల్లడించారు.

10/18/2017 - 02:37

కాకినాడ, అక్టోబర్ 17: పెట్రోల్ బంకుల్లో ఇకనుండి నో హెల్మెట్-నో ఫ్యూయల్ విధానాన్ని విధిగా అమలుచేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఈ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. వాహన చోదకులు హెల్మెట్ లేకుండా బంకులకు వెళ్ళిన పక్షంలో పెట్రోల్‌ను విక్రయించరాదని బంకుల యాజమాన్యాలకు ఆదేశాలందాయి.

10/18/2017 - 02:37

విశాఖపట్నం, అక్టోబర్ 17: ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తే రాష్ట్రాన్ని ఆకాశమే హద్దుగా అభివృద్ధి బాట పట్టిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. తొలి సారిగా ప్రభుత్వం తరపున విశాఖ సాగరతీరంలో ‘ఆనంద దీపావళి’ పేరిట బాలలు, అనాధలతో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

10/18/2017 - 02:34

విజయవాడ, అక్టోబర్ 17: ఉండవల్లిలోని సిఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించారు. అనంతరం వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ను బిస్త్ మర్యాద పూర్వకంగా కలిశారు.

10/17/2017 - 23:48

రాజమహేంద్రవరం, అక్టోబర్ 18: బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. పవర్ హౌస్ నిర్మాణ ప్రక్రియ మట్టి పనుల దశ నుంచి, పునాది పనుల దశకు చేరుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామం వద్ద పోలవరం ప్రాజెక్టు పవర్ హౌస్ నిర్మాణం జరగనుంది. పవర్ హౌస్ నిర్మాణ పనులు ఎపి జెన్కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది.

10/17/2017 - 23:48

ఒంగోలు,అక్టోబర్ 17:ముండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామ విఆర్‌ఒ వి సరోజిని ఒకరైతు వద్దనుండి ఆరువేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు వలపన్ని ఆమెను పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఎసిబి డిఎస్‌పి ప్రభాకర్ విలేఖర్లుకు వెల్లడించారు. కొమ్మవరం గ్రామానికి చెందిన కంచర్ల వీరాంజనేయులు తన పట్టాదారు ఈపాసు పుస్తకంకోసం ఆగ్రామానికి చెందిన విఆర్‌ఒ వి సరోజిని అడిగారు.

10/17/2017 - 03:54

అమరావతి, అక్టోబర్ 16: వైసీపీకి చెందిన కర్నూలు ఎంపి బుట్టా రేణుక టిడిపిలో చేరే ముహుర్తం హటాత్తుగా ముందుకు జరిగింది. తొలుత వచ్చే నెల 1న మాజీ ఎమ్మెల్యేలతో కలసి పార్టీలో చేరాలని భావించారు. ఆ మేరకు పార్టీ నాయకత్వంతో కూడా రేణుక దంపతులు చర్చలు జరిపారు.

10/17/2017 - 03:53

విజయవాడ, అక్టోబర్ 16: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించకుండా వాటి నిర్మాణం కోసం గడ్డపార మట్టి వేసి అడ్డుకుంటాం... ప్రభుత్వంపై ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమమే.. మీకు చేతనైందీ చేస్కోండి... అరెస్టులూ, జైళ్లకూ వెళ్ళేందుకు తామంతా సిద్ధంగా ఉన్నాం. బాధితులకు అండగా వామపక్ష పార్టీలుంటాయి...

10/17/2017 - 03:53

విజయవాడ, అక్టోబర్ 16: ఎలక్ట్రానిక్స్ తయారీరంగ అభివృద్ధికి క్లస్టర్ మోడల్‌ను సిద్ధం చేయాలని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా అనంతపురం, విశాఖ, చిత్తూరులో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సోమవారం మంత్రి లోకేష్ ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధిపై చర్చించారు.

10/17/2017 - 03:52

విజయవాడ, అక్టోబర్ 16: వృద్ధిపై దృష్టి నిలపడమే కాకుండా వ్యయ నియంత్రణలో పట్టు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. జీతభత్యాలకే సరిపోయేలా కొన్ని శాఖల్లో వృద్ధి మందగమనంలో ఉండటం ఇబ్బందికరమని అన్నారు. ఖర్చులను అదుపు చేయడం అన్నింటి కంటే పెద్ద కసరత్తు అని వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ఆదాయార్జన శాఖల పురోగతిని ఆయన సమీక్షించారు.

Pages