S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/17/2017 - 03:48

విజయవాడ, అక్టోబర్ 16: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గడువులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు, మరో 28 ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో ఆయన సోమవారం సమీక్షించారు.

10/17/2017 - 03:47

కర్నూలు, అక్టోబర్ 16: ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేతలందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పార్టీ కండువా కప్పాలని భావిస్తున్నట్లు టిడిపి నేతల ద్వారా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభమైతే తలెత్తే రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు అధికార టిడిపి సైతం సిద్ధమవుతోంది.

10/17/2017 - 03:46

అనంతపురం, అక్టోబర్ 16: అనంతపురం జిల్లా వైకాపాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సోమవారం నగరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి, రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత బి.గుర్నాథరెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. దీంతో గుర్నాథరెడ్డి వ్యతిరేక వర్గం కూడా ఎదురు దాడికి దిగింది.

10/17/2017 - 03:46

విశాఖపట్నం, అక్టోబర్ 16: భారత నౌకాదళానికి మరిన్ని యుద్ధనౌకలను కోల్‌కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేయనుందని గార్డెన్ రీచ్ సిఎండి వి.కె.సక్సేనా తెలియజేశారు. 81 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ కిల్తాన్‌ను విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో సోమవారం ప్రారంభించారు.

10/17/2017 - 03:00

నూజివీడు, అక్టోబర్ 16: విచారణ పేరుతో అధ్యాపకుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అవమానించారంటూ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి, ఇక్కడే తరగతులు నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి అధ్యాపకులు సోమవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. నూజివీడు సర్కిల్ ఇనస్పెక్టర్ రామ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

10/17/2017 - 02:57

అనకాపల్లి, అక్టోబర్ 16: పాత సమస్యల పరిష్కారంపై వచ్చే డిసెంబర్ మొదటి వారానికి ప్రభుత్వానికి కాపు ఉద్యమ సంఘ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం డెడ్‌లైన్ విధించడం విడ్డూరంగా ఉందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ముద్రగడ డెడ్‌లైన్‌ను లెక్కచేసేది లేదని స్పష్టం చేశారు.

10/17/2017 - 02:56

విజయవాడ, అక్టోబర్ 16: కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థినీ, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విద్యార్థి సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగిన కళాశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా చైతన్య, నారాయణ విద్యాసంస్థల ఎదుట భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

10/17/2017 - 02:51

విజయవాడ, అక్టోబర్ 16: ప్రతిపక్ష నేత జగన్ నాన్ రెసిడెంట్ అని, బయటివారి వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత రికార్డులు పరిశీలిస్తే, బీసీలపై ఆయన తండ్రి ప్రభుత్వం కక్ష కట్టిందని తెలుస్తుందని తెలిపారు. ఇంటర్ విద్యార్థుల అత్మహత్యలపై స్పందిస్తూ, ఒక కమిటీని నియమించామని, ఆ నివేదికను నెల రోజుల తరువాత సమీక్షిస్తానన్నారు.

10/17/2017 - 02:49

గూడెంకొత్తవీధి, అక్టోబర్ 16: విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం కోరుకొండ వద్ద పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో అన్నవరం గ్రామానికి చెందిన ఏజెన్సీ వ్యాపారి గొంప లోవ శ్రీనివాస్(35)ను మావోయిస్టులు తుపాకీతో కాల్చి హతమార్చారు. ఈసంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే. చింతపల్లి మండలం అన్నవరం గ్రామానికి చెందిన గొంప లోవ శ్రీను చికెన్ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

10/17/2017 - 02:49

విజయవాడ (క్రైం), అక్టోబర్ 16: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ప్రైవేటు కళాశాలల విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాశాఖా మంత్రి, డిజిపి స్పందించారు. ఒత్తిడి వల్లే విద్యార్థులు చనిపోతున్నారని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పిల్లలా.. యంత్రాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల ఆలోచన కూడా మారాలని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే..

Pages