S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/22/2017 - 03:58

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 21: రౌడీలు రాష్ట్రం వదిలిపోవాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఏమాత్రం ఉపేక్షించవద్దని పోలీసుశాఖను ఆదేశించారు. తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని, అక్రమ సంపాదనకు అలవాటు పడినవారే నేరాలకు పాల్పడుతున్నారన్నారు.

09/22/2017 - 03:56

విజయవాడ, సెప్టెంబర్ 21: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాలని అందుకు అధికారులు కృతనిశ్చయంతో ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లకు సూచించారు.

09/22/2017 - 03:55

అమరావతి, సెప్టెంబర్ 21: చట్టాలు రూపొందించే చట్టసభకు బాధ్యుడు లేని పరిస్థితి నెలకొంది. వెలగపూడిలోని శాసనసభ కార్యాలయానికి ఇప్పటివరకూ పూర్తిస్థాయి కార్యదర్శిని నియమించని ప్రభుత్వం, కనీసం తాత్కాలిక ఇన్చార్జిని కూడా నియమించకుండా తాత్సారం చేస్తోంది. అసెంబ్లీ కార్యదర్శి రామాచార్యులు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడుకు ఓఎస్డీగా వెళ్లిన నాటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది.

09/22/2017 - 03:55

విజయవాడ, సెప్టెంబర్ 21: జూనియర్ కళాశాలల అధ్యాపకులుగా పనిచేస్తూ 2006 తర్వాత డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా పదోన్నతి పొందిన వారికి ఫిట్‌మెంట్ ఫార్ములాను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది. 16.136 శాతం డిఏను కలిపి 15వేల 600 రూపాయలను 100 వేతన స్కేలుతో స్థిరీకరిస్తారు. 2008 జూలై 1 తర్వాత పదోన్నతి పొందినవారికి 28.26 శాతం డిఏను కలిపి 15వేల 600 రూపాయలు 100 వేతన స్కేలుతో స్థిరీకరిస్తారు.

09/22/2017 - 03:54

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగా, ప్రకృతి వైద్య విధానం ద్వారా కూడా మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం అమలుకు అనుమతిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య నెం.154 జీవోను జారీ చేశారు. ఈ పథకానికి ఉండవల్లి కృష్ణా కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయాన్ని రిఫరల్ ఆసుపత్రిగా గుర్తించారు.

09/22/2017 - 03:53

విజయవాడ, సెప్టెంబర్ 21: గిరిజన ప్రాంతాల్లో అనుకూలమైన రవాణా వసతులు లేక అక్కడ పనిచేస్తున్న ‘వెలుగు’ మహిళా సిబ్బంది విధి నిర్వహణలో గ్రామాలను సందర్శించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా వారికి వడ్డీలేని లోన్‌తో టివిఎస్ మోపెడ్ కొనుక్కోవడానికి సెర్ప్ రుణాలు మంజూరు చేసింది.

09/22/2017 - 03:53

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 21: విధుల్లో ప్రతిభ చాటుకోవడమే కాకుండా సామాజిక స్ప్రహతో ఆపదలో ఉన్నవారిని అదుకుని సమర్థవంతమైన సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తూ ప్రవేశపెట్టిన ఇంప్రెసివ్ పబ్లిక్ సర్వీస్ (ఐపిఎస్) అవార్డులు ఈ ఏడాది జూలై మాసానికి ముగ్గురికి దక్కాయి.

09/22/2017 - 02:06

విజయవాడ, సెప్టెంబర్ 21: జిల్లా కలెక్టర్ల సదస్సులో మూడు శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ హాజరు యంత్రాల కొనుగోలులో విద్యా శాఖ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు క్లాస్ తీసుకున్నారు.

09/22/2017 - 02:04

హైదరాబాద్, సెప్టెంబర్ 21: సదావర్తి భూములవేలంలో గరిష్ట స్ధాయిలో బిడ్‌ను ఆఫర్ చేసిన వ్యక్తి నిర్దేశించిన సొమ్మును చెల్లించడంలో విఫలమయ్యారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఎమ్మెల్యే తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసును హైకోర్టు ధర్మాసనం విచారించింది. గతంలో ఈభూములు వేలంలో రూ.22.44 కోట్లకు అమ్మగా, ఈ ఉదంతంపై వచ్చిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

09/22/2017 - 02:04

హైదరాబాద్, సెప్టెంబర్ 21: చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు 14 మందిపై నమోదైన కేసులో ప్రోసీడింగ్స్‌కు హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో తనతో సహా 13 మందిపై ఉన్న కేసును ఎత్తివేయాలని కోరుతూ బి.వి.మురళి దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన జస్టిస్ బి.శివశంకరరావు పై ఉత్తర్వులు జారీ చేశారు.

Pages