S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/22/2017 - 02:03

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రో ఫ్లెమింగ్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్‌తో కూడిన యుకె ప్రతినిధి బృందం గురువారం విశాఖపట్నం పోర్టును సందర్శించింది. పోర్టు వైస్ చైర్మన్ పిఎల్ హర్‌నాథ్ ఈ బృందానికి స్వాగతం పలికారు. విశాఖ పోర్టు నుంచి జరుగుతున్న ఎగుమతి, దిగుమతులను హర్‌నాథ్ ఈ బృందానికి వివరించారు.

09/22/2017 - 02:03

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ది ఉంటే సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

09/22/2017 - 02:02

నందవరం, సెప్టెంబర్ 21: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దుండగులు ఏకంగా బ్యాంకు ఎటిఎంను ధ్వంసం చేశారు. అందులోని రూ.17 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మిగనూరు పట్టణంలోని సిండికేట్ బ్యాంకు ముందుభాగంలో ఉన్న ఎటిఎంను బుధవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు.

09/22/2017 - 02:01

విజయవాడ, సెప్టెంబర్ 21: సదస్సుకు ముందు అధికారులకు రిహార్సల్స్ అవసరమేనని, తమ శాఖ గురించి వివరించే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు అధిక సమయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చమత్కరించారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో అధికారులు తమ శాఖల గురించి క్లుప్తంగా, కలెక్టర్ల నుంచి ఎటువంటి సహకారం కావాలో స్పష్టంగా తెలియచేయాలని సిఎం, సిఎస్ దినేష్‌కుమార్ పదే పదే విజ్ఞప్తి చేశారు.

09/22/2017 - 02:01

విజయవాడ, సెప్టెంబర్ 21: ఇసుక రీచ్‌లలో జరిగే లోపాలను సరిచేయడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు ఉచిత ఇసుకను అందించడమే లక్ష్యంగా రియల్‌టైమ్ గవర్నెన్స్ సమర్థవంతంగా అమలు చేయడానికి వీలు ఏర్పడిందని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

09/22/2017 - 02:00

విజయనగరం, సెప్టెంబర్ 21: మహాకవి గురజాడ వెంకట అప్పారావు గొప్ప తాత్వికవేత్త అని ప్రధాన వక్త, కాలమిస్ట్ డాక్టర్ డివి సూర్యారావు అన్నారు. గురజాడ 155వ జయంతిని గురువారం ఇక్కడ ఆనందగజపతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ మనిషిని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రచనలు చేయడమేగాక తెలుగు భాషను ఆధునిక, వ్యవహారిక భాషగా మార్పు చేయడానికి కృషి చేశారన్నారు.

09/21/2017 - 23:51

బైరెడ్డిపల్లి, సెప్టెంబర్ 21 : ఏనుగుల దాడుల్లో రైతులు మృత్యువాత పడటం చిత్తూరు జిల్లాలో పరిపాటిగా మారింది. గత కొనే్నళ్లుగా పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తూ పంట పొలాలను నాశనం చేయడంతో పాటు పలువురు రైతులను బలిగొంటున్నాయి. తాజాగా బైరెడ్డిపల్లి మండల పరిధిలో మరో రైతు ఏనుగుల దాడిలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

09/21/2017 - 23:50

చిత్తూరు, సెప్టెంబర్ 21: ఎర్రచందనం అక్రమ రవాణాలో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అయిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన నరేంద్రబాబు అలియాస్ బాబును ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి స్కోడా కారుతో పాటు ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి చిత్తూరు టాస్క్ఫోర్సు డీఎస్పి గిరిధర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి .

09/21/2017 - 23:50

మడకశిర, సెప్టెంబర్ 21: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల వల్లే జిడిపి వృద్ధి రేటు ఐదు శాతానికి తీసుకువచ్చారని పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గురువారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశంలో జిడిపి పెరుగుదలను పది శాతానికి తీసుకువచ్చామన్నారు.

09/21/2017 - 23:49

అనంతపురం, సెప్టెంబర్ 21: సంచలనాలతో తరచూ వార్తల్లోకెక్కుతున్న అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్‌రెడ్డి.. ఈసారి ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తానంటూ అస్త్రాన్ని సంధించి మరోమారు సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో బోర్డింగ్ పాస్ విషయంలో అక్కడి ఉద్యోగిపై చేయి చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.

Pages