S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/07/2016 - 02:35

విజయవాడ, నవంబర్ 6: ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా దశాబ్దకాలం పైగా అంతులేని నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఎపిఎస్‌ఆర్టీసీకి పెరుగుతున్న డీజిల్ ధరలు ఆశనిపాతంగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో చీటికిమాటికి డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఎపిఎస్ ఆర్టీసీ ఇప్పటికే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలపైగా నష్టాలతో సతమతమవుతోంది.

11/07/2016 - 02:34

మదనపల్లె, నవంబర్ 6: ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీలో చోటుచేసుకుంది. మదనపల్లె రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.. మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ బార్లపల్లె సమీపంలోని అప్పయ్యగారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమార్తె యమునకు ఏడేళ్ల కితం పట్టణానికి చెందిన సురేష్‌తో వివాహమైంది. ఏడాది తర్వాత సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

11/07/2016 - 02:34

కడప, నవంబర్ 6 : కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసుశాఖ ఎంతో కట్టుదిట్టంగా ముందుకుపోతున్నా ఎర్రచందనం దుంగల అక్రమ తరలింపు ఆగలేదనే చెప్పవచ్చు. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాత్రింబవళ్లు కష్టపడుతున్నా తమిళ తంబీలు దర్జాగా శేషాచల అడవిలోకి చొరబడుతున్నారన్న విషయం జగమెరిగిన సత్యం.

11/07/2016 - 02:33

ఒంగోలు అర్బన్, నవంబర్ 6: నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి అన్నారు. ఆదివారం స్ధానిక వౌర్య సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిర్భయ చట్టంలో ఎన్నో లొసుగులు ఉన్నాయని, రేప్ కేసుల్లో కేసులు నమోదుచేసినా పటిష్టంగా అమలుకు నోచుకోవటంలేదన్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయకపోతే బాధితులకు అన్యాయం జరుగుతుందన్నారు.

11/07/2016 - 01:10

విజయవాడ, నవంబర్ 6: దోమలపై దండయాత్ర ప్రారంభించిన ఏపి సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దోమలను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు దోమల బ్రీడింగ్ నిరోధక చట్టాన్ని రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముసాయిదా పత్రాన్ని తయారు చేస్తోంది. ఈ చట్టాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒకేసారి అమలు చేయాలని ప్రతిపాదించారు.

11/07/2016 - 01:09

కర్నూలు, నవంబర్ 6: రాష్ట్ర శాసన మండలి చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన చక్రపాణి రాజకీయంగా అజాతశత్రువుగా పేరొందారు.

11/07/2016 - 01:05

గుంటూరు, నవంబర్ 6: అమరావతిలో ప్రతిష్ఠాత్మకమైన ఇండో-యూకె హెల్త్ యూనివర్శిటీకి ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ ద్వారా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇండో-యూకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ మెడికల్ ప్రాజెక్టులో భాగంగా రూ.1000 కోట్లతో వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని, వెయ్యి పడకల మెగా ఆసుపత్రిని కృష్ణాయపాలెంలో నెలకొల్పనున్నారు.

11/06/2016 - 03:22

ఎస్. రాయవరం, నవంబర్ 5: విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ సమీపంలో పెద్దమదుం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాజువాక నుండి విజయవాడ వెళ్తున్న ఇన్నోవా కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి కల్వర్టు గోడను ఢీకొట్టి కాలువలోకి బోల్తాపడింది.

11/06/2016 - 03:19

హైదరాబాద్, నవంబర్ 5: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు వాతలు పెట్టేందుకు రాష్ట్ర డిస్కాంలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి)కి వార్షిక రెవెన్యూ నివేదికలను తయారు చేసేందుకు డిస్కాంలు, ఏపి ట్రాన్స్‌కో కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో రెవెన్యూకు, ఖర్చుకు మధ్య లోటు దాదాపు రూ.7500 నుంచి రూ 8 వేల కోట్లు ఉంటుందని అంచనా.

11/06/2016 - 03:19

రాజమహేంద్రవరం, నవంబర్ 5: న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం వుందని, హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వమే స్పందిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన శనివారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

Pages