S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/08/2017 - 02:27

విజయవాడ, మార్చి 7: ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్లు వేసిన ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 8వ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైసిపి అభ్యర్థి గంగుల ప్రభాకరరెడ్డి భార్య నామినేషన్ ఉపసంహరించుకోవటం ఎన్నిక ఏకగ్రీవమైంది.

03/08/2017 - 02:26

పోలవరం, మార్చి 7: ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై నిశిత పరిశీలన జరుగుతోంది. ప్రాజెక్టులోని నిర్మాణాలకు సంబంధించిన డిజైన్ల ఆమోదం కోసం ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ మంగళవారం కాంట్రాక్టు ఏజన్సీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

03/08/2017 - 02:26

విజయవాడ, మార్చి 7: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రతిపక్షం తరపున ప్రతిపక్ష నాయకుడు మాత్రమే మాట్లాడుతున్నందున ప్రసంగానికి అడ్డంకులు కల్పించకుండా గంటన్నరపాటు ఏకధాటిగా సమయం ఇవ్వాలంటూ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి.. స్పీకర్ కోడెల శివప్రసాదరావును అభ్యర్థించారు. వాయిదా అనంతరం సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత జగన్ మాట్లాడారు.

03/07/2017 - 04:52

విశాఖపట్నం, మార్చి 6: ప్రధాని నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి అజేయశక్తిగా ఎదుగుతోందనడానికి ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే నిదర్శనమన్నారు.

03/07/2017 - 04:51

రాజమహేంద్రవరం, మార్చి 6: గోదావరి బేసిన్‌లో డెల్టా ఆధునికీకరణ పనులు డోలాయమానంగా తయారయ్యాయి. ఏటికేడాది గడిచిపోతున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగా ఉంటున్నాయి. 2007లో మంజూరైన ఈ పనులు ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా వుంది. లక్ష్యానికి దూరంగా పనులు సాగుతూనేవున్నాయి. ఆధునీకరణ ఫలితాలు మాత్రం రైతులకు దక్కడంలేదు.

03/07/2017 - 04:50

విజయవాడ, మార్చి 6: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు వైకాపా ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. దాదాపు సంవత్సరం తరువాత ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆసెంబ్లీ ప్రాంగంలోకి వచ్చిన దగ్గర నంచి చాలా మంది ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగడం కనిపించింది. ప్రతిపక్ష నేత కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా దేవుడి పటం వద్ద ఆమె కొబ్బరికాయ కొట్టారు.

03/07/2017 - 04:50

తుళ్లూరు, మార్చి 6: నూతన రాజధాని అమరావతిలో తొలిసారిగా సమావేశమవుతున్న ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ రాజధాని ప్రాంత రైతులు భారీ వింధును ఏర్పాటుచేశారు.

03/07/2017 - 04:49

విజయవాడ, మార్చి 6: రాష్ట్ర ప్రభుత్వ దిశ, దశలను ప్రస్తావిస్తూ సాగిన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్ఫూర్తివంతమైన ప్రసంగంతో కొత్త రాజధానిలో అందునా కొత్త ప్రాంగణంలో చారిత్రాత్మకమైన శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం విజయవంతంగా ప్రారంభమయ్యాయి.

03/07/2017 - 04:48

కడప, మార్చి 6: పరీక్ష అనంతరం జవాబుపత్రం ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండా వెంట తీసుకువెళ్లాడు ఓ ఇంటర్ విద్యార్థి. ఆలస్యంగా గమనించిన పరీక్ష నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. పరీక్ష సరిగా రాయలేకపోవడంతో భయంతోనే జవాబుపత్రం వెంట తీసుకువెళ్లినట్లు విద్యార్థి తులసీరాయుడు తెలిపారు. కడప నగరంలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

03/07/2017 - 04:48

ఏలూరు, మార్చి 6 : పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టర్ కాటంనేని భాస్కర్, రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్‌వి సాగర్ మధ్య రగడ చినికి చినికి గాలివానగా మారుతూవస్తోంది. ఒకరు ఉద్యమం పేరుతో రంగంలోకి దిగుతుంటే, మరొకరు ఆరోపణలు వచ్చాయంటూ విచారణలకు ఆదేశించడం ఆ తర్వాత సినీ ఫక్కీలో పరిణామాలు మారుతూ వస్తున్నాయి. సోమవారం ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో రోడ్డున పడింది.

Pages