S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/04/2017 - 02:26

న్యూఢిల్లీ, మార్చి 3: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి, ఉండవల్లి గ్రామ పంచాయితీకి చెందిన 26 మంది దళితుల భూముల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి సిఆర్‌డిఏ అసైన్డ్ ప్యాకేజీ ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యురాలు పిఎం కమలమ్మ గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కమలమ్మ శుక్రవారం తన ముందు హాజరైన కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇతర రెవెన్యూ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు.

03/04/2017 - 02:25

హైదరాబాద్, మార్చి 3: విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాంబిక ఆలయం కోసం నాలుగెకరాల భూమి కొనుగోలుకు టిటిడికి చెందిన ఐదుకోట్ల నిధులు వినియోగించడటం చెల్లదంటూ ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో కేసు నమోదైంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అనకాపల్లి పర్యటనకు వెళ్లిన సమయంలో నూకాంబికా ఆలయానికి నాలుగెకరాల భూమి కొనుగోలు చేసేందుకు టిటిడి నుండి నిధులు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే దరఖాస్తు ఇచ్చారు.

03/04/2017 - 02:20

అనకాపలి, మార్చి 3: విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం ఇంటిలిజెన్స్ పోలీసులు దాదాపు 65 లక్షల రూపాయల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి కేంద్రంగా చాలాకాలం నుంచి ఈ వ్యాపారం సాగుతున్నట్లుగా భావిస్తున్నారు.

03/03/2017 - 04:49

విజయవాడ, మార్చి 2: రాష్ట్రంలో వరుసగా బస్ ప్రమాదాలు జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఉండవల్లిలో తన నివాసం నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన రోడ్లు ప్రమాదాలపై ఆరా తీశారు.

03/03/2017 - 04:48

విజయవాడ, మార్చి 2: రాష్ట్ర అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం భావోద్వేగానికి గురైయ్యారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును గుర్తు చేసుకుని ఉగ్వేదానికి లోనయ్యారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన జరిగిన తీరు సమయంలో బాధ పడిన విధంగా తన జీవితంలో మరెప్పుడూ బాధపడలేదన్నారు.

03/03/2017 - 04:48

ప్రత్తిపాడు, మార్చి 2: పంచభూతాల సమతుల్యం దెబ్బతినడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల ప్రళయాలు సంభవిస్తున్నాయని, ఇవి రాకుండా ఉండాలంటే ప్రకృతి సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ భక్తులకు ఉద్బోధించారు.

03/03/2017 - 04:46

ఒంగోలు/దొరవారిసత్రం, మార్చి 2 : కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోరప్రమాద సంఘటన మరువకముందే ప్రకాశం ,నెల్లూరు జిల్లాల్లో గురువారం ఉదయం రెండు ప్రైవేటు బస్సులు ఘోర ప్రమాదానికి గురయ్యాయి. ప్రకాశం జిల్లా పిసి పల్లివద్ద తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 47 మందికి తీవ్రగాయాలు కాగా మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

03/03/2017 - 04:43

విజయవాడ, మార్చి 2: కూచిపూడి నృత్య నాటకాల ప్రదర్శనలకు అనువైన రచనలను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డి.విజయ్‌భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి నృత్య నాటకాల ప్రదర్శనల కోసం ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రదర్శనలకు భిన్నంగా కొత్త కోణంలో రచనలను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

03/03/2017 - 04:43

ఏలూరు, మార్చి 2: పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీల పంటతో కళకళలాడనుంది. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఉండగా వాటికి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కూడా పూరె్తైంది. ఈ రెండు స్థానాలతోపాటు మరో ఎమ్మెల్సీ స్థానం కూడా జిల్లాకు అదనంగా లభించనుందనే చెప్పాలి.

03/03/2017 - 04:41

అనంతపురం, మార్చి 2: అనంతపురం జిల్లాలో ‘ఉపాధి’ పనుల కల్పనలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓవైపు పనులు కల్పించడం లేదని గ్రామీణులు ఆరోపిస్తుంటే...మరోవైపు ఉపాధి పనులు కల్పించినా జనం రావడం లేదంటూ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో పంట కుంటలు (్ఫరంపాండ్స్) తవ్వకానికే అనుమతి ఉందని, ఇతర పనులు చేపట్టలేమని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఆ పనుల వైపే వారు మొగ్గు చూపుతున్నారు.

Pages