S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/16/2017 - 02:03

ఖమ్మం, సెప్టెంబర్ 15: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎవరికి వారు గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నామినేషన్ల దాఖలుకు తొలిరోజు గురువారం ఒకటి, శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.

09/16/2017 - 02:02

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్రాన్ని సైబర్ సెక్యూరిటీకి హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ రంగానికి పెద్దపీట వేయడంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించామన్నారు.

09/15/2017 - 03:49

విజయవాడ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు సచివాలయం 2వ బ్లాక్‌లోని తన చాంబర్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఉదయం నిర్వహించిన తమ శాఖ సమీక్షలో స్పష్టమైంది.

09/15/2017 - 03:49

విజయవాడ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వినూత్న ప్రాజెక్టులతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్టు ఏపీని పర్యాటకులకు స్వర్గ్ధామంగా తీర్చిదిద్దాలని చెప్పారు.

09/15/2017 - 03:48

విజయవాడ, సెప్టెంబర్ 14: ఏకీకృత నిబంధనల రూపకల్పనపై మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, గాదె శ్రీనివాసులు నాయుడు, రామకృష్ణ, రామసూర్యారావు తదితరులు గురువారం భేటీ అయ్యారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను తెలుసుకుంటూ నిబంధనలను ఏ విధంగా రూపొందించాలనే అంశంపై చర్చించారు.

09/15/2017 - 03:47

విజయవాడ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో నెలకొన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపి కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ గురువారం కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ను కోరారు. నిరుద్యోగుల ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని కోరుతూ రాష్ట్రంలో నెలకొన్న తన శాఖాపరమైన అంశాలను కేంద్రమంత్రికి వినతిపత్రం రూపంలో అందించారు.

09/15/2017 - 03:47

విజయవాడ, సెప్టెంబర్ 14: పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి తానంటే భయం పట్టుకున్నట్లుందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గం నుంచే 5సార్లు, ఒకసారి పత్తికొండ నుంచి మొత్తం 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు.

09/15/2017 - 03:46

విజయవాడ, సెప్టెంబర్ 14: ఇటీవల జరిగిన కామనె్వల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. వెలగపూడి సచివాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన విజయనగరం జిల్లా కొండవెలగాడు గ్రామానికి చెందిన సంతోషి, గుంటూరు జిల్లాకు చెందిన అన్నదమ్ములు రాగాల వరుణ్, రాహుల్‌ను గురువారం సత్కరించారు.

09/15/2017 - 03:43

విజయవాడ, సెప్టెంబర్ 14: కేజి నుంచి పిజి వరకు బయోమెట్రిక్ హాజరు చేపట్టి, సిఎం డ్యాష్ బోర్డులోకి అనుసంధానించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు నమోదులో కొన్ని వర్సిటీలు అలసత్వం వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తిస్థాయిలో హాజరు నమోదుకు చర్యలు చేపట్టాలని అన్ని వర్సిటీల విసిలను ఆదేశించారు.

09/15/2017 - 03:43

విజయవాడ, సెప్టెంబర్ 14: విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేస్తేనే నదుల పరిరక్షణ సాధ్యమని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అన్నారు. నదుల పరిరక్షణకోసం విజయవాడ నగరంలో బుధవారం జరిగిన సభలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిజ్ఞను అందరూ గౌరవించాల్సిందేనని, అయితే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Pages