S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/07/2016 - 13:56

విశాఖ: పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎపి విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం ఉదయం ఇక్కడి కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు రాసే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు.

03/07/2016 - 11:52

గుంటూరు: తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద సోమవారం ఉదయం ఇసుక మేట వద్ద ఫుట్‌బాల్ ఆడుతున్న నలుగురు పిల్లలు భూమిలోకి కూరుకుపోయారు. స్థానికులు ముగ్గురిని కాపాడారు. ఐతే ప్రవీణ్ నాయక్ అనే బాలుడు ఊబిలో ఊపిరాడక మరణించాడు.

03/07/2016 - 11:51

గుంటూరు: కోటప్పకొండ ప్రాంతాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎ.పి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరిగే జాతర ఏర్పాట్లను సోమవారం ఉదయం ఆయన పరిశీలించారు.

03/07/2016 - 11:49

గుంటూరు: శివరాత్రి సందర్భంగా కృష్ణానదిలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థి నీట మునిగి మరణించాడు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

03/07/2016 - 11:48

హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో సోమవారం వేకువజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర, శ్రీముఖలింగం, రామతీర్థం తదితర ఆలయాల్లో అర్చనలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

03/07/2016 - 07:27

హైదరాబాద్, మార్చి 6: బ్రిటీష్ హై కమిషనర్ ఆహ్వానంపై పెట్టుబడులు తెచ్చేందుకు లండన్ వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడున్న మ్యూజియంను సందర్శించాలని అమరావతి అభివృద్ధి అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. మ్యూజియంలో ఉన్న అద్భుతమైన బౌద్ధ శిల్పకళా సంపదను అమరావతికి తీసుకువచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను సిఎం చంద్రబాబుకు రాసినట్లు తెలిపారు.

03/07/2016 - 07:09

రాజమహేంద్రవరం: గోదావరి తీరంలో భారతీయ జనతాపార్టీ నిర్వహించిన సంకల్ప సభ విజయవంతమయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి-బిజెపి సంకల్పం నినాదంతో భారతీయ జనతాపార్టీ నిర్వహించిన సంకల్ప సభ ఆ పార్టీకి నవ్యాంధ్రప్రదేశ్‌లో తిరుగులేని అదనపు బలాన్ని ఇచ్చింది.

03/07/2016 - 07:08

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టే స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి మంగళవారం ఉదయం 10:30 గంటల నుండి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భాతర అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో ముహూర్తం ఖరారు చేసింది.

03/07/2016 - 07:00

సూళ్లూరుపేట: దేశంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఆదివారం షార్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశంలోకి 10 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడ్డారని, ఏ క్షణంలోనైన దాడులు చేయవచ్చునని ఐబి హెచ్ఛరికలు జారీ చేసినే నేపథ్యంలో అన్ని ప్రధాన నగరాల్లో కేంద్ర భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.

03/07/2016 - 06:57

హైదరాబాద్: తెలంగాణలో ఓటుకు నోటు కేసుతోనే తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతమతమవుతుంటే, మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్‌పై హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేయడం తలనొప్పిగా మారింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి రావెల కిశోర్‌ను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొంత చికాకు పడినట్లు తెలిసింది.

Pages