S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/03/2016 - 14:46

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో జరుగుతున్న ఆందోళనపై టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు బుధవారం తన పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ ఆందోళనను పలు రూపాల్లో కొనసాగించాలని ఆయన సూచించారు. కేంద్రం స్పందనపై తమ భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

08/03/2016 - 14:45

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో తాము చేస్తున్న పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు టిడిపి ఎంపీలు తెలిపారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, అనంతకుమార్ ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వారం లోగా తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే మళ్లీ పోరాటం ప్రారంభిస్తామన్నారు.

08/03/2016 - 14:44

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదాను సాధించడంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆయన స్వగ్రామమైన వీరులపాడు మండలం పొన్నవరంలో బుధవారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సుజనా ఇంటి ముందు రోడ్డును చీపుర్లతో ఊడ్చి వారు తమ నిరసన తెలిపారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు సుజనాచౌదరి బిజెపితో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

08/03/2016 - 14:37

విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఉదయం డీసీసీ అధ్యక్షుడు ఆదిరాజు ఆధ్వర్యంలో విజయనగరంలోని కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు బంగ్లా ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు.

08/03/2016 - 13:01

విజయవాడ: రేపు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయల్దేరనున్నారు. ప్రత్యేక హోదా విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌‌ను పుష్కరాలకు ఆహ్వానించనున్నారు.

08/03/2016 - 11:47

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విజయవాడలో బుధవారం ఉదయం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చీపుర్లను చేతపట్టుకుని రోడ్లను ఊడ్చారు. హోదా విషయంలో బిజెపి, టిడిపి నేతలు నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

08/03/2016 - 11:46

రాజమండ్రి: నగరంలోని ఆల్మట్‌తోట వద్ద బుధవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ఆటో, వ్యాన్ ఢీకొనగా మధ్యలో ఓ బైక్ ఇరుక్కుపోయి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రెండు వాహనాలను ఓవర్‌టేక్ చేయడానికి బైక్‌పై ప్రయాణిస్తున్న వారు ప్రయత్నించి కింద పడ్డారు. ఆటో, వ్యాన్ మధ్య వారు నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.

08/03/2016 - 11:46

దిల్లీ: ఎపిలో అన్ని చోట్లా టిడిపి నేతల ఇళ్ల ముందు చీపుర్లతో తమ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు జరుపుతారని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం మంగళవారం జరిపిన రాష్టబ్రంద్‌తో కేంద్రంపై ఒత్తిడి పెరిగిందన్నారు. హోదా విషయంలో టిడిపి, బిజెపిలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

08/03/2016 - 07:40

విశాఖపట్నం, ఆగస్టు 2: వాయువ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కూడా కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీనికి తోడు ఒడిశా నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

08/03/2016 - 07:39

నూజివీడు, ఆగస్టు 2: పోలవరం కుడికాల్వకు పడిన గండి పూడ్చివేత పనులను మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరం చేశారు. గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల నుండి పోలవరం కాల్వ ద్వారా కృష్ణానదికి తరలిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ సమీపంలో 122 కి.మీ. అండర్ టనె్నల్ వద్ద కాల్వకు గండి పడింది.

Pages