S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/17/2016 - 05:49

విజయవాడ, డిసెంబర్ 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్‌సిటీగా ప్రకటించిన ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో తక్షణం పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు దోమల బెడదను నివారింపచేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాసారు.

12/17/2016 - 05:49

తిరుపతి, డిసెంబర్ 16: తమిళనాడుకు చెందిన శేఖర్‌రెడ్డికి ఎవరో సిఫార్సు చేస్తే టిటిడి ధర్మకర్త మండలిలో సభ్యుడుగా స్థానం కల్పించామని, తప్పు చేయడంతో తీసేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

12/17/2016 - 05:08

విజయవాడ, డిసెంబర్ 16: 2014-16లో ఎపిలో 46,72,124 మంది టిడిపి సభ్యత్వం తీసుకున్నారు. 2016-18కి గాను ఇప్పటికే 58,75,005 మంది సభ్యులుగా చేరారు. అంటే 12,02,781 సభ్యత్వం పెరిగింది. పెద్ద నోట్ల రద్దుతో నగదు సమస్య ఉన్నప్పటికీ సభ్యత్వం గణనీయంగా పెరగడం ఒక రికార్డని ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు.

12/17/2016 - 05:08

అమరావతి, డిసెంబర్ 16: పెద్ద నోట్లు రద్దయి నేటికి 40 రోజులు, సామాన్యులపై కేంద్రం సంధించిన రద్దు అస్త్రం తగలాల్సిన వారికి కాకుండా సామాన్యులకు వజ్రఘాతమయింది. ఫలితంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న నోట్ల కష్టాలపై రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. వారిపై ఒక్కోసారి ఆగ్రహం... రోజూ అసంతృప్తి...

12/17/2016 - 05:07

విజయవాడ, డిసెంబర్ 16: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై జాతీయ పోరాటం చేపడతామని ఎపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు.

12/17/2016 - 05:07

గుంటూరు, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ అనావృష్టి నివారణ పథకం కింద ఐదు జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరుతో పాటు ప్రకాశం జిల్లాలో 1.65 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలపై ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో సమీక్ష జరిగింది.

12/17/2016 - 05:06

విజయవాడ, డిసెంబర్ 16: కాకులు దూరని కారడివి.. చీమలు దూరని చిట్టడివిగా జీవనం సాగించే గిరిజనుల్లో వెలుగు నింపేందుకై దివంగత ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన ఆశ్రమ పాఠశాలల్లో గత 14 ఏళ్లుగా ఎదుగు బొదుగూ లేక నామమాత్రపు జీతాలతో కాలం వెళ్లదీస్తున్న రాష్ట్రంలోని 1520 మంది కాంట్రాక్టు పాఠశాల ఉపాధ్యాయులకు ఓ శుభవార్త.. వీరందరికీ రెట్టింపు కాదు..

12/17/2016 - 05:05

గుంటూరు, డిసెంబర్ 16: వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ చెల్లనినోటుగా మిగిలిపోతారని సిపిఐ జాతీయ కార్యదర్శి పి నారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా 120 మంది సామాన్యులు మృతిచెందారని ఇవన్నీ మోదీ చేసిన హత్యలుగానే భావించాల్సి ఉందన్నారు.

12/17/2016 - 04:10

తిరుపతి, డిసెంబర్ 16: సమాజానికి ఉపయోగపడే విధంగా వినూత్నంగా ఆలోచించినప్పుడే విద్యకు సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం తిరుపతిలో రూ.182.11 కోట్లవ్యయంతో స్విమ్స్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి మహిళా వైద్యవిద్య కళాశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

12/17/2016 - 04:08

వాకాడు, డిసెంబర్ 16: బంగాళాఖాతం సముద్రంలో చేపలవేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన తొమ్మిది మందిలో ఇద్దరు నెల్లూరు జిల్లావాసులు. ఏడుగురు చెన్నైకు దగ్గరలోని కాశినేడుకు చెందినవారని తెలిసింది.

Pages