S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/29/2017 - 03:46

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు, మంత్రి లోకేశ్‌తో సహా 17 మంది బృందంతో సహా వచ్చే నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో 17 మంది సభ్యుల బృందం పర్యటించనుంది.

04/29/2017 - 03:46

అమరావతి, ఏప్రిల్ 28: రాష్ట్రంలో సొంతంగా బలపడేందుకు బిజెపి కసరత్తు ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల నాటికి 15 పార్లమెంటు స్థానాల్లో కీలకశక్తిగా ఎదిగే ప్రణాళికకు ఆ పార్టీ నాయకత్వం పదునుపెడుతోంది. ఆ మేరకు గత రెండేళ్లుగా విజయం సాధించిన, వివిధ రాష్ట్రాల్లో అనుసరించిన పోలింగ్ బూత్ వ్యవస్థను ఇక్కడా అమలుచేయనుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..

04/29/2017 - 02:19

అమరావతి, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలన్నీ పునర్ వైభవం సాధించడానికి మరో 3మాసాల గడువు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మే 14లోపు మహిళా సంఘాల నాయకులు, సభ్యులతో ఆ శాఖలో పనిచేస్తున్న 5వేల మంది ఉద్యోగులు సమావేశాలు ఏర్పాటుచేసి వారి ఆదాయం పెంచే మార్గాలపై సమగ్ర కార్య ప్రణాళికలను సిద్ధం చేసుకుని రావాలని ఆదేశించారు.

04/29/2017 - 02:17

గూడూరు, ఏప్రిల్ 28: తమ ఉత్పత్తులను ఒక్కసారిగా యార్డులకు తరలించుకురావడంతో కొంతమేర గోదాముల సమస్య వల్ల మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిర్చి, పసుపు రైతులకు భరోసా ఇచ్చారు.

04/29/2017 - 02:17

వరికుంటపాడు, ఏప్రిల్ 28: కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణహత్యకు దారితీసింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల పరిధిలోని ఇరువూరు గ్రామ పంచాయితీ పరిధిలోని తూర్పుపాలెంలో గురువారం రాత్రి ఈఘటన చోటు చేసుకొంది. రెండురోజుల క్రితం ఈ రెండు కుటుంబాల సభ్యులు కుళాయి వద్ద ఘర్షణ పడ్డారు.

04/29/2017 - 02:16

తిరుపతి, ఏప్రిల్ 28: ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ మినీ లగేజీవ్యాన్‌ను శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి టాస్క్ఫోర్స్ సిబ్బంది సినీఫక్కీలో వెంటాడారు. ఈక్రమంలో మినీ లగేజీ వ్యాన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన స్మగ్లర్ నరుూంను అరెస్టు చేశారు. నరుూంను వెంటాడే సమయంలో టాస్క్‌పోర్స్ కానిస్టేబుల్స్ ఇద్దరికి స్వల్పగాయాలైయ్యాయి.

04/29/2017 - 02:14

భీమవరం, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రకటించిన రాయితీ ఆఫర్ సత్ఫలితాలనిస్తోంది. ఏడాది ఆస్తిపన్ను మొత్తం ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విస్తృత ప్రచారం కూడా చేపట్టారు. దీనితో గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది పన్ను వసూళ్లు రెట్టింపయ్యాయి.

04/29/2017 - 02:14

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: తొలి నాటకానికి తెరలేచిన వేదిక..తొలి నాటకం రూపుదాల్చిన గోదావరి చెంత రాజమహేంద్రవరంలో కందుకూరి విశిష్ట, ప్రతిష్ఠాత్మక రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవం, నంది నాటక బహుమతుల ప్రదానోత్సవాన్ని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. నందమూరి తారక రామారావు పేరిట ఇచ్చే తొలి అవార్డుల ప్రదానం కూడా రాజమహేంద్రవరం నుంచే ఆరంభించడం విశేషం.

04/29/2017 - 02:13

ఏలూరు, ఏప్రిల్ 28: వివిధ అంశాల్లో ముందంజలో ఉంటూనే రాజకీయ చైతన్యంలోనూ పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాకు తాజాగా రెండు ఘనతలు జతకూడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్) జిల్లాగా పశ్చిమగోదావరి జిల్లాను ప్రకటించనున్నారు. మరోవిధంగా చూస్తే దాదాపుగా దక్షిణాదిరాష్ట్రాల్లోనే ఈవిధంగా పూర్తి ఒడిఎఫ్‌గా ప్రకటించిన జిల్లాలు లేవన్న అంచనా కూడా ఉంది.

04/29/2017 - 02:12

హైదరాబాద్, ఏప్రిల్ 28: ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక మీడియాను అడ్డంపెట్టుకుని ఎపి సిఎం చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. కొన్ని ప్రసారమాధ్యమాలు పనిగట్టుకుని జగన్ బెయిల్ రద్దు అయ్యిందంటూ కథనాలు ప్రచారం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages