S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/10/2017 - 03:24

విజయవాడ, సెప్టెంబర్ 9: రవాణా శాఖలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేయడంతోపాటు వాహనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో అరికట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని రవాణాశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు.

09/10/2017 - 03:19

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో అమలు చేస్తున్న చంద్రన్న బీమా పథకం పేరును మార్పు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రన్న బీమా రెండవ విడత పథకం అక్టోబర్ 2 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకూ అమల్లో ఉంటుందని తెలిపారు. రెండో విడత పథకానికి ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకంగా పేరు మార్చినట్లు తెలిపారు.

09/10/2017 - 03:18

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు సంతృప్తికరమైన సేవలు అందించడం వలన వారంతా కృతజ్ఞతాభావంతో ఉంటారనేది వైద్యులు, సిబ్బంది గుర్తించాలన్నారు.

09/10/2017 - 03:16

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో 2014-15 సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు పరిశ్రమలశాఖ మంత్రి ఎన్.అమరనాథ్‌రెడ్డి తెలిపారు.

09/10/2017 - 03:15

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో సిఆర్‌డిఎ చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు జిఎస్‌టి నుంచి మినహాయింపు ఇవ్వాలని జిఎస్‌టి కౌన్సిల్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు.

09/10/2017 - 01:44

సింహాచలం, సెప్టెంబర్ 9: హిందూ ధర్మాన్ని పరిరక్షణకు దేవాలయాల నిధులు ఖర్చు చేయడం సమంజసమేనని రాష్ట్ర దేవాలయాల పరిపాలన సంస్థ (సితా) డైరెక్టర్ విజయ రాఘవాచార్యులు అన్నారు. సితా వ్యవహరంపై గతంలో దేవాదాయ శాఖలోని కొంత మంది అధికారులు, దేవాలయాల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, వివాదం రేగడం తెలిసిందే.

09/10/2017 - 01:42

విశాఖపట్నం, (ఆరిలోవ) సెప్టెంబర్ 9: ప్రపంచ ప్రఖ్యాత ‘సంతూర్’ విద్వాంసులు, పద్మవిభూషణ్ పండిట్ శివకుమార్ శర్మకు అతిథులు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శ్రీ కొప్పరపుకవులు కళాపీఠం జాతీయ ప్రతిభా పురస్కారం అందజేశారు.

09/10/2017 - 01:40

కాకినాడ, సెప్టెంబర్ 9: కాకినాడ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలు పతాకస్థాయికి చేరాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఈ రెండు పదవులను కైవశం చేసుకునేందుకు మార్గం సుగమం కావడంతో పార్టీకి చెందిన కార్పొరేటర్లు విశ్వప్రయత్నాల్లో ఉన్నారు. ఈనెల 1వ తేదీన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం విధితమే!

09/10/2017 - 01:39

విజయవాడ, సెప్టెంబర్ 9: దేశంలోనే అతి పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టయిన పోలవరం నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ ఇంతవరకూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దాసరి భవన్‌లో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాగు, సాగునీటితోపాటు 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.

09/10/2017 - 01:38

ఆత్మకూరు, సెప్టెంబర్ 9: నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో పలు మండలాల్లో దాచి ఉంచిన ఎర్రచందనం స్వాధీనంచేసుకున్నామని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ చెప్పారు. శనివారం ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇద్దరు అంతర్‌రాష్ట్ర స్మగ్లర్లు, 19 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేయడంతో సహా రూ.1.2కోట్ల రూపాయల విలువైన 51 దుంగల స్వాధీనం చేసుకున్నామన్నారు.

Pages