S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/10/2017 - 01:37

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ళుగా కాంగ్రెస్‌లోనే ఉంటూ అనేక పదవులు నిర్వహించానన్నారు. కేంద్ర మంత్రి గా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించానన్నారు. మధ్యలో ఓ రెండేళ్లు మినహా పార్టీకి ఎప్పుడూ దూరం కాలేదన్నారు.

09/10/2017 - 01:36

నందికొట్కూరు, సెప్టెంబర్ 9: శ్రీశైలం జలాశయానికి వరద నీరు రావడంతో హంద్రీనీవాకు శనివారం నీరు విడుదల చేశారు. శ్రీశైలం నీటిమట్టం 816 అడుగులకు చేరడంతో కర్నూలు జిల్లా మల్యాల సమీపంలో ని హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథకం ఒక పంపు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. శ్రీశైలానికి చేరే నీటిని బట్టి మిగతా పంపుల ద్వారా నీరు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

09/09/2017 - 23:47

కర్నూలు, సెప్టెంబర్ 9: దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. రెండు పార్టీలు ఈనెల 11వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

09/09/2017 - 23:46

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో ఇసుక రవాణాలో చోటు చేసుకున్న అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పులేకపోతే, తాను రీచ్‌ల్లో తనిఖీలు చేస్తానని అధికారులకు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇసుక విధానం, రవాణా తదితర అంశాలపై చోటు చేసుకుంటున్న ఆరోపణలపై చర్చ జరిగింది.

09/09/2017 - 23:46

కర్నూలు, సెప్టెంబర్ 9: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం. విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సొంత పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తరువాత ఆయన తిరిగి సొంత గూటికి చేరనున్నారు.

09/09/2017 - 23:45

మడకశిర, సెప్టెంబర్ 9: కర్నాటక రాజధాని బెంగళూరులో ఉద్యోగ పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై కన్నడ సంఘాలు దాడికి పాల్పడటం బాధాకరమని, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కర్నాటక హోంమంత్రి రామలింగారెడ్డికి పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి సూచించారు. విద్యార్థులపై దాడి జరిగినట్లు తెలియగానే ఆయన మంత్రి రామలింగారెడ్డికి ఫోన్ చేశారు.

09/09/2017 - 03:14

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో మారుమూల గిరిజన, కొండ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ పేర్కొన్నారు.

09/09/2017 - 03:12

విజయవాడ, సెప్టెంబర్ 8: నగదు రహిత విశాఖ కార్యక్రమాన్ని అక్టోబర్ 9 నుంచి ప్రారంభించనున్నట్టు వీసా కంపెనీ ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌కు తెలిపారు. వెలగపూడి సచివాలయం నుంచి వీసా కంపెనీ ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా నగదు రహిత విశాఖ అమలుపై సమీక్ష నిర్వహించారు.

09/09/2017 - 03:10

అనంతపురం, సెప్టెంబర్ 8: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రంలో చేపట్టిన నీటి ప్రాజెక్టుల పనులు ఆగవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా హెచ్చెల్సీకి విడుదల చేసిన తుంగభద్ర జలాలకు బాబు హారతి ఇచ్చారు.

09/09/2017 - 03:06

జి.మాడుగుల, సెప్టెంబర్ 8: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. ఒకేసారి నాలుగు పొక్లయిన్లను దగ్ధం చేసి మన్యంలో సంచలనానికి తెరలేపారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలో కేబుల్ వేసేందుకు గోతులు తవ్వుతున్న పొక్లయిన్లను మావోయిస్టులు గురువారం రాత్రి దగ్ధం చేశారు.

Pages