S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/09/2017 - 03:03

విశాఖపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 8: సంతూర్ వాద్య పరికర సృష్టికర్త, పద్మవిభూషణ్ పండిట్ శివకుమార్ శర్మకు ప్రతిష్ఠాత్మక కొప్పరవు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం ప్రకటించారు. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో శనివారం జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేయనున్నట్టు పురస్కార కార్యక్రమ నిర్వాహకుడు మా శర్మ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు.

09/09/2017 - 03:02

నెల్లూరు, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మార్కెటింగ్, సహకార శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టంచేశారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఏర్పడి నూరు వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నెల్లూరులోని బ్యాంక్ ఆవరణలో శత వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

09/09/2017 - 01:42

విజయవాడ, సెప్టెంబర్ 8: వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష వైకాపాకు అడ్రస్ లేకుండా ఫుల్ స్వీప్ చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన నంద్యా ల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో 2019 ఎన్నికల్లో టిడిపిదే విజయం అని అర్థం అవుతోందన్నారు. కాకినాడలో వైసిపిని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేయాలనుకున్నా సాధ్యం కాలేకపోయిందన్నారు.

09/09/2017 - 01:40

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రాజధాని ముసుగులో ఎపి సిఎం చంద్రబాబునాయుడు చేస్తున్న రియల్ దోపిడీపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రాజధాని నిర్మాణంపైనా శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

09/09/2017 - 01:44

సీలేరు, సెప్టెంబర్ 8: డొంకరాయి రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం చేరడంతో శుక్రవారం సాయంత్రం నుంచి జెన్‌కో అధికారులు మూడు వేల క్యూసెక్కుల నీటిని రెండు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నామని ఎస్‌ఇ మురళీమోహన్ తెలిపారు.

09/09/2017 - 01:37

తిరుపతి, సెప్టెంబర్ 8: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామికి తిరుమలలో ఈనెల 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఇంజినీరింగ్ విద్యుత్ శాఖ, ఉద్యాన వన శాఖ ఆధ్వర్యం లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లుచేస్తున్నారు. స్వామివారి కటౌట్లు, ఆర్చీ లు, విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేయడంలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు.

09/09/2017 - 01:35

మదనపల్లె, సెప్టెంబర్ 8: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వేంకటేశ్వర్వస్వామి ఆలనపాలన చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసే ధర్మకర్తల మండలికి చైర్మన్ పదవి చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త సిఎం రవిశంకర్‌ను వరించే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్నటివరకు నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు పేరు వినిపించింది.

09/09/2017 - 01:32

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో త్వరలోనే ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

09/09/2017 - 00:14

విశాఖపట్నం (జగదాంబ), సెప్టెంబర్ 8: ప్రాచీన వైద్యాన్ని బలోపేతం చేస్తూ త్వరలో ఎపి, తమిళనాడులో విదేశీ సంస్థల సాయంతో అంతర్జాతీయ స్థాయి ఆయుష్ ఆసుపత్రులు నిర్మిస్తామని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్ అన్నారు.

09/09/2017 - 00:14

కాకినాడ, సెప్టెంబర్ 8: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. ఇప్పటికే ఎన్నికలు పూర్తయినప్పటికీ, మేయర్ ఎన్నికపై కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్ధ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్‌కుమార్ శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదలచేశారు.

Pages