S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/09/2017 - 00:14

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 8: పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి సొంత ఇళ్ల నిర్మాణానికి తగుచర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) నండూరి సాంబశివరావు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

09/09/2017 - 00:13

సింహాచలం, సెప్టెంబర్ 8: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటు చేయాడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బెంగళూరుకు చెందిన వివేకానంద యోగ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చొక్కలింగం శుక్రవారం సింహగిరికి వచ్చి దేస్థానం ఈవో రామచంద్రమోహన్‌తో ఈ మేరకు చర్చలు జరిపారు.

09/09/2017 - 00:12

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 8: ప్రజల సహకారంతో నిర్మిస్తున్న ప్రజా రాజధానిపై మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని ఏపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. జగన్‌కు అద్దె మైకులా ఐవైఆర్ వ్యవహరిస్తున్నారని, రేపో, మాపో వైసిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఆయన దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.

09/09/2017 - 21:00

రామకుప్పం, సెప్టెంబర్ 8: క్షణికావేశం ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. నవ మాసాలు మోసి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లే ఈ దారుణానికి ఒడికట్టింది. అభం శుభం తెలియని చిన్నారులను కన్న తల్లే ఉరివేసి చంపిన విషాద సంఘటన రామకుప్పం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండల పరిధిలోని కవ్వంపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి, పవిత్రలకు దినేష్‌రెడ్డి(5), వృతిక్‌రెడ్డి(3) జన్మించారు.

09/09/2017 - 00:11

గుంటూరు, సెప్టెంబర్ 8: గుంటూరు రూరల్ ఎఆర్ పోలీసు సిబ్బందికి ప్రతి సోమవారం వారాంతపు సెలవు అమలు చేయనున్నట్లు రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పలనాయుడు తెలిపారు. గుంటూరు నగరంలోని పోలీసు పెరెడ్‌గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన పోలీసు దర్బార్‌లో ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా ఒక రోజు కల్చరల్ ఈవెంట్స్, క్రీడలు నిర్వహిస్తామన్నారు.

09/09/2017 - 00:09

విశాఖపట్నం, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వ ఐటి విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్‌లో 30 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని ఇండియన్ ఇన్నోవేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎఎస్ రావు తెలిపారు.

09/09/2017 - 00:06

విజయవాడ, సెప్టెంబర్ 8: వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా వైకాపా కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 11న ప్రారంభమయ్యే కార్యక్రమానికి సంబంధించి దాదాపు 4.3 లక్షల కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా పార్టీ సభ్యత్వం ఇవ్వటం లక్ష్యంగా పెట్టుకుని, ఆ మేరకు శిక్షణ ఇస్తున్నారు.

09/09/2017 - 00:05

విజయవాడ, సెప్టెంబర్ 8: బొగ్గు కొరతతో విజయవాడలోని ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు ధర్మల్ విద్యుత్ స్టేషన్‌లో గత కొద్ది రోజులుగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతూ శుక్రవారం నాటికి దారుణంగా పడిపోయింది. అదృష్టవశాత్తు భారీ వర్షాల వల్ల విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఉంది.

09/09/2017 - 00:05

విజయవాడ, సెప్టెంబర్ 8: వివిధ సాహితీ ప్రక్రియల్లో విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖులకు కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రతి ఏటా అందించే పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ సాయంత్రం హోటల్ ఐలాపురంలో జరగనుంది.

09/09/2017 - 00:04

అమరావతి, సెప్టెంబర్ 8: నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కోసం పోరాడాల్సిన రాజకీయ పార్టీలు ‘ప్రవాస ప్రతిపక్షం’ ముద్రతో స్వపక్షంలోనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రెండు ప్రతిపక్షపార్టీలు చేస్తున్న ‘ప్రవాస పోరాటాలు’ ఫలితాలివ్వకపోవడంపై సొంత పార్టీల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Pages