S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/09/2017 - 00:03

విజయవాడ, సెప్టెంబర్ 8: తెలుగునాట ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ పతనమవుతున్న తీరుపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన పతాక స్థాయికి చేరిందని, కులం, పార్టీల పేరుతో ప్రజల్ని నిలువునా చీలుస్తూ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు.

09/09/2017 - 00:03

విజయవాడ, సెప్టెంబర్ 8: తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి, పార్టీలోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారన్నారు. పెద్ద నాయకుల నుంచి కార్యకర్తల వరకూ ఎవరు పార్టీలోకి వచ్చినా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

09/08/2017 - 03:29

అమరావతి, సెప్టెంబర్ 7: ‘ఆగస్ట్ 26న నేను అమరావతి వచ్చిన సందర్భంగా నాకు మీరు, మీ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు ప్రజలు అపూర్వ రీతిలో చేసిన పౌర సన్మానం ఎన్నటికీ మరువలేనిది.

09/08/2017 - 03:26

అమరావతి, సెప్టెంబర్ 7: మరో రెండేళ్ల నాటికి ఎఎఐఎంఎస్ సంస్థ ఆధ్వర్యంలో తొలిదశలో భాగంగా 300 పడకల ఆసుపత్రితో మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వైద్య విద్యా రంగంలో ఏపి రాజధాని అమరావతిని ప్రథమ స్థానంలో నిలపడంలో ప్రపంచస్థాయి మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

09/08/2017 - 03:24

తిరుపతి, సెప్టెంబర్ 7: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని చాలాకాలం తరువాత దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేత నేపథ్యంలో ఆ మండపాన్ని యధాస్థానంలో నిర్మించేంత వరకు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోనని చిన్నజీయర్ స్వామి ప్రతిజ్ఞ చేసిన విషయం పాఠకులకు విదితమే.

09/08/2017 - 03:20

విశాఖపట్నం, సెప్టెంబర్ 7: జ్వరం వచ్చిందని రెండేళ్ల పిల్లాడిని కెజిహెచ్‌లో చేర్చితే, నెల రోజుల వరకూ జ్వరం తగ్గించకపోగా, పిల్లాడి చూపు పోగొట్టి, ఇంటికి పంపించారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఫిషర్‌మెన్ కాలనీకి చెందిన రెండేళ్ల పిల్లాడు సిద్దూకు నెల రోజుల కిందట జ్వరం వచ్చింది. స్థానిక వైద్యులు సిద్దూకు టిబి సోకిందని చెప్పారు. దీంతో సిద్దూను కేజిహెచ్‌లో చేర్చారు.

09/08/2017 - 03:17

విశాఖపట్నం (జగదాంబ), సెప్టెంబర్ 7: రాష్టవ్య్రాప్తంగా ఖాళీగా ఉన్న పీడియాట్రీషియన్, గైనకాలజిస్టుల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం కెజిహెచ్‌లో పలు వార్డులు, క్యాజువాలటీ విభాగాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, కలెక్టర్‌తో కలిసి కెజిహెచ్ అభివృద్ధి పనులపై సమీక్షించారు.

09/08/2017 - 02:01

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: అత్యాధునిక రీతిలో రూ. 20కోట్లతో నిర్మించిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నూతన భవనాన్ని గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలో నిర్మించతలపెట్టిన 33కెవి సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా లిఫ్టు ద్వారా వెళ్లి కౌన్సిల్‌హాలు, కమాండ్ కంట్రోల్‌రూమ్, మేయర్ ఛాంబర్లను పరిశీలించారు.

09/08/2017 - 01:59

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: పోలీసు ఉద్యోగం అంటే పెత్తనం చేయడం కాదని, ప్రజలతో స్నేహంగా మెలుగుతూ ఆ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రూ. 14కోట్లతో నిర్మించిన రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

09/08/2017 - 01:56

నెల్లూరు, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అనుమతి లేకున్నా, నిబంధనలు పాటించని వ్యవసాయ కళాశాలను చేస్తామని వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తిరుపతి శివారు తుమ్మలగుంటలోని ఎంఎస్ స్వామినాథన్ అగ్రకల్చరల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అక్కడ వౌలిక వసతులు లేమిని గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాలేజీని రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు.

Pages