S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/07/2017 - 23:00

విజయవాడ, సెప్టెంబర్ 7: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి (ఐఎఫ్‌ఎడి), రాష్ట్ర ప్రభుత్వం మధ్య గురువారం ఢిల్లీలో కీలక ఒప్పందం జరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యవసాయ శాఖకు సుమారు రూ. 500 కోట్ల రుణం అందనుందని, రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ శాఖకు అంతర్జాతీయ సంస్థతో ఇదే తొలి ఒప్పందమని తెలిపారు.

09/07/2017 - 22:59

కాకినాడ, సెప్టెంబర్ 7: నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘన విజయం సాధించి జోరుమీదున్న తెలుగుదేశం పార్టీ ఇక కాపు సామాజికవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. తూర్పు గోదావరి జిల్లాలో కాపులందరి మద్దతు తెలుగుదేశానికే ఉందని, ఆ దిశగా విస్తృత ప్రచారం చేయాలని ఈ ప్రాంత నేతలకు పార్టీ అధిష్ఠానం నుండి స్పష్టమైన ఆదేశాలందాయి.

09/07/2017 - 22:59

విజయనగరం, సెప్టెంబర్ 7: నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు తమ పార్టీకి రిఫరెండమన్న వైకాపా నేత జగన్ ఫలితాలు వెలువడ్డాక మాట మార్చారని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన నెల్లిమర్లలోని చంపావతి నదికి జలహారతి కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి, ప్రతిపక్షానికి మధ్య ఓట్ల వ్యత్యాసం 16 శాతం ఉందన్నారు.

09/07/2017 - 03:11

విజయవాడ, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి 7 స్టార్స్ ఫార్ములా ఉపయోగించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన పంచాయితీరాజ్ అధికారులతో స్మార్ట్ విలేజ్ కార్యక్రమంపై బుధవారం సమీక్షం నిర్వహించారు.

09/07/2017 - 03:11

విజయవాడ, సెప్టెంబర్ 6: వ్యవసాయ కళాశాలకు సంబంధించిన జీఓ 64ను రద్దు చేసినట్టు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటిలాగే జీఓ 16 కొనసాగుతుందన్నారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా చేపట్టదలచిన సమ్మెను విరమిస్తున్నట్లు అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ కళాశాలలపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు.

09/07/2017 - 03:11

విజయవాడ, సెప్టెంబర్ 6: దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు అంబులెన్స్‌లను రంగంలోకి దించితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యమేస్తోంది కదూ! రోడ్ల ఆరోగ్య సేవలకు అంబులెన్సుల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. వీటిని రోడ్డు అంబులెన్సులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో దశలవారీగా 200 రోడ్డు అంబులెన్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కసరత్తు చేస్తున్నారు.

09/07/2017 - 03:10

బుక్కరాయసముద్రం, సెప్టెంబర్ 6: నీటివంకలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలం గుమ్మేపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన తేజ (6), నాగిరెడ్డి (7), అరవింద్ (7) స్నేహితులు. బుధవారం మాల పున్మమి కావడంతో బడికి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నారు. ఆడుకునేందుకు గ్రామశివారులోని వంక వద్దకు వెళ్లారు. రాత్రి కురిసిన వర్షానికి వంకలో నీరు ఉద్ధృతంగా వవహిస్తోంది.

09/06/2017 - 03:40

అమరావతి, సెప్టెంబర్ 5: పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల మనస్తత్వంపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరీక్ష పెట్టారు. మంగళవారం జరిగిన పార్టీ వర్క్‌షాప్‌లో ఈ పరీక్ష నిర్వహించారు. థామస్ టెస్ట్ పేరుతో రూపొందించిన 20 ప్రశ్నలతో తమ్ముళ్ల మనస్తత్వం విశే్లషించే పని ప్రారంభించింది. సదరు నాయకుడు తన గురించి తాను ఏమనుకుంటున్నారు? బలవంతుడా? బలహీనుడా? సొంతంగా నాయకత్వం వహించాలనుకుంటున్నారా?

09/06/2017 - 03:39

అమరావతి, సెప్టెంబర్ 5: విజయవాడకు సమీపంలో ఇబ్రహీంపట్నం వద్ద 700 పడకలతో అమరావతి-అమెరికన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కానుంది.

09/06/2017 - 03:38

విజయవాడ, సెప్టెంబర్ 5: శ్రీకాకుళం జిల్లాలో పలాస మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆ ప్రాంత రైతులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని సిఎం నివాసంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రైతులు సిఎంను కలిసి అభినందనలు తెలిపారు.

Pages