S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/06/2017 - 03:38

విజయవాడ, సెప్టెంబర్ 5: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 13 మంది అధికారులు, రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఇద్దరు అధికారులపై వచ్చిన అరోపణలను విచారించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని తాజాగా నియమించింది. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ స్థానంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

09/06/2017 - 02:59

అమరావతి, సెప్టెంబర్ 5: రాజధాని అమరావతిలో సమీప భవిష్యత్తులో 13 వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడ ఎ ప్లస్ కనె్వన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని 31 మంది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను సత్కరించారు.

09/06/2017 - 02:57

విశాఖపట్నం, సెప్టెంబర్ 5: పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వం ఆదేశించి చాలా కాలమే అయింది. కానీ అది ఎక్కడా అమలు కావడం లేదు, సరికదా, గత వారం రోజుల నుంచి ఉత్తరాంధ్రలో ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరో ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే, ఉచిత ఇసుక అంటే ఏంటి? అని విశాఖలో పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.

09/06/2017 - 02:56

నందికొట్కూరు, సెప్టెంబర్ 5: గౌరవం దక్కే పార్టీలో చేరతానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక సీమ కోసం తాను చేసిన ఉద్యమాన్ని ప్రజలు సమర్ధించలేదన్నారు. అందుకే పార్టీని మూసివేస్తున్నానన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు మరో పార్టీలో చేరతానన్నారు.

09/06/2017 - 02:55

విశాఖపట్నం, సెప్టెంబర్ 5: సమగ్ర నీటి నిర్వహణకు పెద్దఎత్తున ప్రచారం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేయనున్న ‘జలసిరి హారతి’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో బుధవారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా నీటి వనరుల నిర్వహణ, యాజమాన్యం అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

09/06/2017 - 02:55

అవుకు, సెప్టెంబర్ 5: కర్నూలు జిల్లా అవుకు మండలంలో ఆర్టీసీ బస్సు మంగళవారం అదుపుతప్పి అవుకు రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లింది. అయితే రాళ్లు అడ్డుగా రావడంతో బస్సు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. బనగానపల్లె డిపో ఆర్టీసీ బస్సు ఉప్పలపాడు నుంచి అవుకుకు వస్తుండగా పెద్దమ్మ కనుమవద్ద అదుపుతప్పి రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లింది.

09/06/2017 - 02:09

విశాఖపట్నం, సెప్టెంబర్ 5: దక్షిణాది రాష్ట్రాల గ్రీన్ ట్రిబ్యునల్ సదస్సు ఈ నెల 15,16 తేదీల్లో విశాఖలో జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రలో ఒకే వేదికపైకి రావడం ఇది రెండో సారి.

09/06/2017 - 02:08

రేణిగుంట, సెప్టెంబర్ 5: సభ్యసమాజం తలదించుకునేలా ఒ పాస్టర్ మైనర్‌బాలికపై అత్యాచారం జరిపిన ఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55 సంవత్సరాల పాస్టర్ 11 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుసుకున్న స్థానిక మహిళలు గుంజకు కట్టేసి చితక్కొట్టారు. తరువాత పోలీసులకు అప్పగించారు.

09/06/2017 - 02:08

ఉయ్యాలవాడ, సెప్టెంబర్ 5: కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలంలో మంగళవారం కుందరవాగులో ఓ రైతు కొట్టుకుపోయాడు. ఇది గమనించిన ఇంజేడు గ్రామస్థులు తాడు సాయంతో రైతును రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంజేడు గ్రామ సమీపంలో కుందరవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

09/06/2017 - 01:55

హైదరాబాద్, సెప్టెంబర్ 5: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 96 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. సికిందరాబాద్-విజయవాడ-సికిందరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (18 సర్వీసులు) రైళ్లు అక్టోబర్ 1,8,15,22,29 తేదీల్లో, నవంబర్ 5,12,19,26 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.

Pages