S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/06/2017 - 00:56

విజయవాడ, సెప్టెంబర్ 5: దేశవ్యాప్తంగా ఐఎఎస్, ఐపిఎస్ వంటి ఉన్నతాధికారుల బదిలీలు రాత్రికి రాత్రే జరిగిపోతుంటాయి. అన్నీ సవ్యంగా వుంటే ఏకంగా ప్రభుత్వాల మార్పిడి కూడా సాఫీగా జరిగిపోతుంటుంది. మరి కారణమేమిటో కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి నుంచి కూడా ఉపాధ్యాయుల బదిలీల్లో ఎప్పుడూ గందరగోళం నెలకొంటూ ఉంటుంది.

09/05/2017 - 03:34

గుంటూరు, సెప్టెంబర్ 4: మూడేళ్లలోపు పసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో త్వరలో ‘బాలామృతం’ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఈ పథకం కింద 7 నెలల నుంచి మూడేళ్లలోపు 14లక్షల 15వేల మంది పిల్లలకు నెలకు రెండున్నర కిలోల పౌష్టికారాన్ని అందిస్తామని తెలిపారు.

09/05/2017 - 03:32

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 4: జలసిరికి హారతి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భాగస్వాములు కావాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. సోమవారం ఉదయం విజయవాడలోని జల వనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వంశధార, పెన్నా, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

09/05/2017 - 03:31

విజయవాడ, సెప్టెంబర్ 4: ప్రభుత్వంలోని అన్ని శాఖలు విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై సమీక్షించారు.

09/05/2017 - 03:22

తెనాలి, సెప్టెంబర్ 4: విజయవాడ నుండి చెన్నై వెళ్ళే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మల్లెపాడువద్ద పెద్ద ప్రమాదం తప్పింది. పట్టా విరిగిన విషయాన్ని గమనించిన డ్రైవర్ వేగాన్ని తగ్గించి నెమ్మదిగా రైలును నిలిపి వేశాడు. విజయవాడ నుండి చెన్నై వెళ్ళే పినాకినీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం ఉదయం 6.30గంటలకు తెనాలికి చేరుకుంది.

09/05/2017 - 03:20

తిరుపతి, సెప్టెంబర్ 4: ప్రిన్సిపాల్ ఎదుటే ఇరు వర్గాల విద్యార్థులు ముష్టియుద్ధానికి దిగారు. ప్రిన్సిపాల్ చాంబర్ రణరంగంగా మారింది. పరస్పర దాడులతో ఫర్నిచర్ ధ్వంసమైంది. గాజుపెంకులు తగిలి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి.

09/05/2017 - 03:20

తిరుపతి, సెప్టెంబర్ 4: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి అశోక్ లేలాండ్ సంస్థ తయారుచేసిన రూ. 6 లక్షలు విలువచేసే ట్రక్కును ఆ సంస్థ అధ్యక్షుడు నితిన్‌సేథ్ సోమవారం విరాళంగా అందించారు. దోస్త్ ఫ్లస్ నమూనా ట్రక్కును ఆలయం ముందుంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు, ట్రాన్స్‌పోర్ట్ డిఐ భాస్కర్‌నాయుడుకు అందించారు.

09/05/2017 - 03:18

గూడెంకొత్తవీధి, సెప్టెంబర్ 4: విశాఖ ఏజన్సీ చింతపల్లి మండలంలోని అన్నవరం సమీపంలో సోమవారం ప్రమాదవశాత్తు జీపు వాగులో బోల్తా పడింది. ఈ సంఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని అన్నవరం నుంచి తమ్మంగుల వెళ్ళే రహదారి మధ్యలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

09/05/2017 - 03:16

నంద్యాల, సెప్టెంబర్ 4: రాష్ట్ర పరిధిలో చట్టాల రూపకల్పనకు పెద్దల సభగా అభివర్ణించే శాసనమండలి చైర్మన్ పదవి కర్నూలు జిల్లావాసులను మూడవ సారి వరించింది. నంద్యాల పట్టణానికి చెందిన ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్‌ను మండలి చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు.

09/05/2017 - 03:11

విజయవాడ, సెప్టెంబర్ 4: భవిష్యత్తు పునరుత్పాదక శక్తిదే (రిన్యూబుల్ ఎనర్జీ) అని ఆంధ్ర ప్రదేశ్ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) చైర్మన్ అజయ్‌జైన్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం నెడ్‌క్యాప్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

Pages