S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/05/2017 - 00:28

విజయవాడ, సెప్టెంబర్ 4: ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని, విద్యార్థుల భవిష్యత్తు దిశా నిర్దేశకులు ఉపాధ్యాయులేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివర్ణించారు. తల్లి, తండ్రి ఆది గురువులైనా విద్యార్థుల మానసిక వికాసం గురువు శిక్షణలోనే సాధ్యమవుతుందని, భావితరాలను సమాజానికి అందించేది వారేనని స్పష్టం చేశారు. నైపుణ్యంతో, పరిజ్ఞానంతో కూడిన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు.

09/05/2017 - 00:28

విజయవాడ, సెప్టెంబర్ 4: అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని పౌరసరఫరాలు, ధరల నియంత్రణ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

09/05/2017 - 00:27

విజయవాడ, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో జిల్లా విద్యాశాఖ అధికారుల (డిఇఓ) నియామకాలకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమాల కథనాలు, ఆరోపణలపై ఉన్నతస్థాయి న్యాయవిచారణకు సోమవారం ఆదేశించింది.

09/05/2017 - 00:26

విజయవాడ, సెప్టెంబర్ 4: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి వీలుగా ఒక మహిళ స్థలాన్ని విరాళంగా అందచేశారు. దుగ్గిరాలకు చెందిన మహిళా సమాజం చైర్‌పర్సన్ జె.కుసుమ కుమారి 3 కోట్ల రూపాయలు విలువ చేసే 50 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు సిఎం చంద్రబాబు నాయుడికి సోమవారం పత్రాలను అందచేశారు.

09/05/2017 - 00:26

విజయవాడ, సెప్టెంబర్ 4: అనంతపురం జిల్లాలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో సూక్ష్మ నీటిసాగు కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

09/05/2017 - 00:22

అమరావతి, సెప్టెంబర్ 4: ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ శక్తి ఉంటుంది.. ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ మానసిక ఉల్లాసం ఉంటుంది.. నీటి భద్రతతోనే జీవనభద్రత, సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధ్యం.. అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

09/04/2017 - 23:42

మంగళగిరి, సెప్టెంబర్ 4: రాష్ట్ర శాసన మండలిని సజావుగా నడిపిస్తానని, ప్రజా సమస్యలపై చర్చ జరిగే విధంగా చూస్తానని శాసన మండలి చైర్మన్‌గా ప్రకటించిన ఎన్‌ఎండి ఫరూఖ్ పేర్కొన్నారు. సోమవారం గుంటూరుజిల్లా మంగళగిరిలో టిడిపి నిర్వహించిన వర్క్‌షాప్‌లో శాసన మండలి చైర్మన్‌గా ఫరూఖ్ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

09/04/2017 - 23:41

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: ఛత్తీస్‌గడ్ నుంచి రాయలసీమ వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాని పేర్కొన్నారు.

09/04/2017 - 23:40

విజయవాడ (ఇంద్రకీలాద్రి) సెప్టెంబర్ 4: న్యూఢిల్లీలోని ఏపి భవన్‌లో త్వరలో శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు దుర్గగుడి కమిటీ చైర్మన్ గౌరంగబాబు, ఇవో సూర్యకుమారి తెలిపారు.

09/04/2017 - 23:40

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 4: కాకినాడ, నంద్యాల ఎన్నికల్లో విజయం సాధించామని, కాపులు తమ వెంటే ఉన్నారని సంబరాలు చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2019 వరకు ఆగకుండా అసెంబ్లీ రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సూచించారు.

Pages