S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/04/2017 - 23:39

విశాఖపట్నం (క్రైం), సెప్టెంబర్ 4: ప్లే స్కూల్ భవనం శ్లాబు కూలి చిన్నారి మృత్యువాత పడిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. మూడేళ్ల బాలుడు కె.గౌతమ్ మృతి చెందడం కంటతడి పెట్టించింది. ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఎ.ఆర్) పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గోపాలరావుకు ఇద్దరు కుమారులు కాగా, చిన్న కుమారుడు గౌతమ్‌ను స్థానికంగా ఉన్న ప్లేస్కూల్‌లో చదివిస్తున్నాడు. ఎప్పటి లాగే గౌతమ్ సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లాడు.

09/04/2017 - 23:38

శ్రీకాకుళం, సెప్టెంబర్ 4: ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికల నిర్వహణ, నిబంధనలు చాలా బలీయమైనప్పటికీ ఆ విధానంలో ఎన్నికలు జరగకపోవడం, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతోందని, అటువంటి ఎన్నికలను సంస్కరించాలంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేసారు.

09/04/2017 - 23:38

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: సమయం వృథా కాకుండా క్షణాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడిసిఎల్) ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే వందల కొద్దీ వినియోగదారులు ఈ విధానం ద్వారా బిల్లులు చెల్లించగలుగుతున్నారు.

09/04/2017 - 03:21

విజయవాడ, సెప్టెంబర్ 3: తిరుపతి- తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలను రోలర్ సేఫ్టీ బ్యారియర్లతో చెక్ పెట్టే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పశ్చిమ ఆస్ట్రేలియా సాంకేతిక సహకారంతో ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించాలని నిర్ణయించింది. ఈమేరకు ఇటీవల అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునేందుకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి.

09/04/2017 - 03:18

తిరుపతి, సెప్టెంబర్ 3: తిరుమలలో ఆదివారం కుంభవృష్టి కురిసింది. దీంతో రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలోని మట్టిపెళ్లలు, చిన్నచిన్న బండరాళ్లు రోడ్డుపైకి జారిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. బండరాళ్లు రోడ్డుపై పడినప్పటికీ వాహనచోదకులు జాగ్రత్తగా కొండపైకి చేరుకున్నారు. కాగా, సమాచారం తెలుసుకున్న టిటిడి అధికారులు వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.

09/04/2017 - 03:15

విజయవాడ, సెప్టెంబర్ 3: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నవంబర్ 9, 10, 11 తేదీల్లో కొత్త ఢిల్లీలో లక్షలాది మంది కార్మికులతో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి తెలిపారు.

09/04/2017 - 03:06

అమలాపురం, సెప్టెంబర్ 3: మాజీ రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 129వ జయంతిని పురస్కరించుకుని అమలాపురానికి చెందిన విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయుడు గురునాథ రాజు, నాణాల సేకరణకర్త పుత్సా కృష్ణకామేశ్వర్లు సంయుక్తంగా నాణేలతో రూపొందించిన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం స్థానిక వాకర్స్ క్లబ్‌లో ఆ చిత్రాన్ని వారు ప్రదర్శించారు.

09/04/2017 - 03:03

విజయనగరం, సెప్టెంబర్ 3: రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విద్యుత్ లైన్లు లేని గ్రామాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మావో ప్రభావిత ప్రాంతాల్లో కూడా సోలార్ విద్యుద్దీపాలు ఏర్పాటు చేసేందుకు సర్వే చేపట్టారు.

09/04/2017 - 02:01

విజయవాడ, సెప్టెంబర్ 3: ఉమ్మడి రాష్ట్రంలో, విభజన అనంతరం ఏపిఎస్ ఆర్టీసీ దాదాపు 4వేల కోట్ల రూపాయల నష్టాలతో మనుగడ సాగిస్తున్న నేపథ్యంలో సంస్థ ఎండి, వైస్ చైర్మన్ ఎం మాలకొండయ్య సిబ్బందిని, ప్రయాణికులను నొప్పించకుండా తనదైన శైలిలో సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చులు తగ్గాయి. ఇంధనం పొదుపయింది. ఆపై ఆదాయం పెరిగింది.

09/04/2017 - 01:59

విజయవాడ, సెప్టెంబర్ 3: అమెరికాలో తెలుగు చిన్నారులకు గత నాలుగేళ్లుగా తెలుగు భాష నేర్పిస్తున్న ఎన్‌ఆర్‌ఐ సంస్థలు తిరిగి ఈ నెల 9 నుంచి తరగతులు ప్రారంభించబోతున్నాయి. అమెరికాలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కృష్ణా జిల్లావాసి కోమటి జయరామ్ చైర్మన్‌గా ఎంఎస్‌ఏ, ఇతర సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాల 501 సి(3) సర్ట్ఫికెట్ కూడా పొందింది.

Pages