S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/03/2017 - 00:35

విజయవాడ, సెప్టెంబర్ 2: నూజివీడు ఐఐఐటిలో ర్యాగింగ్ వ్యవహారంపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించి, సీరియస్ అయ్యారు. ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ రామచంద్రరాజు, నూజివీడు ఐఐఐటి డైరెక్టర్‌తో మాట్లాడారు. ర్యాగింగ్ నిరోధానికి చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.

09/03/2017 - 00:34

విజయవాడ, సెప్టెంబర్ 2: వ్యవసాయ శాఖ ప్రమాణాలకు పెను విఘాతంగా పరిణమించిన జీవో 64 రద్దుచేయాలని, వ్యవసాయశాఖలోని అన్ని రకాల ఉద్యోగాలను పోటీ పరీక్ష ద్వారా భర్తీ చేయాలని, అలాగే జీవో 16 యథాతథంగా అమలుచేసి వ్యవసాయ రంగాభివృద్ధికి చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు.

09/03/2017 - 00:34

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 2: నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఇంటిలిజెన్స్ నివేదిక పేరుతో ముందస్తు సర్వేను వెబ్‌సైట్‌లో ప్రచురించడాన్ని చట్ట వ్యతిరేకంగా భావిస్తూ నమోదైన కేసులో మన తెలంగాణా న్యూస్ ఎడిటల్ కూన అజయ్‌బాబు, మరో వ్యక్తిని నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈనెల 23వ తేదీన జరిగిన విషయం తెలిసిందే.

09/03/2017 - 00:32

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 34 ఏళ్ల వయస్సులోనే నాడు ఎన్‌టిఆర్ ప్రభంజనాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే వైఎస్‌ఆర్‌కు నిజమైన నివాళి అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పేర్కొన్నారు.

09/03/2017 - 00:32

విజయవాడ, సెప్టెంబర్ 2: ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చెందిన జిల్లా, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు 175 మందిని తొలగించడం సరికాదని ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా లోతుగా విశే్లషణ చేసిన తరువాత, ప్రభుత్వ పథకాలను అందరికీ తెలియచేసేందుకు వీలుగా కో-ఆర్డినేటర్ల వ్యవస్థను రూపొందించినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

09/02/2017 - 03:23

అమరావతి, సెప్టెంబర్ 1: నంద్యాల, కాకినాడ ఎన్నికల గెలుపు ద్వారా రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మా పార్టీపై, ప్రభుత్వంపై ప్రజలు అచంచల విశ్వాసంతో గెలిపించారన్నారు.

09/02/2017 - 03:21

అమరావతి, సెప్టెంబర్ 1: కాపు-బలిజ జాతికి నాయకుడిగా వ్యవహరిస్తూ వారిని బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమిస్తోన్న మాజీ మంత్రి, కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం ప్రభావం ప్రతిష్ఠాత్మకంగా జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో నామమాత్రంగా కూడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

09/02/2017 - 03:20

విజయవాడ, సెప్టెంబర్ 1: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 9న జరుగనుంది. వెలగపూడి సచివాలయంలో ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఆగస్టు 3న గత మంత్రి మండలి సమావేశం జరిగింది. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ ఎన్నిక కారణంగా ప్రతి 15 రోజులకు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం కొంత ఆలస్యంగా జరుగనుంది.

09/02/2017 - 03:20

అమరావతి, సెప్టెంబర్ 1: కాకినాడలో పార్టీ తిరుగులేని మెజారిటీతో కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న తర్వాత టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో శుక్రవారం విజయోత్సాహాలు నిర్వహించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకు అభినందనలు చెప్పారు. అంతకుముందు.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..

09/02/2017 - 03:14

రేణిగుంట, సెప్టెంబర్ 1: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. భారత రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ తొలిసారిగా తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసం ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. అంతకుముందుగా ఉదయం 10 గంటలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

Pages