S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/02/2017 - 03:11

విజయవాడ, సెప్టెంబర్ 1: తమ పాలిట శాపంలా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల మిలీనియం మార్చ్‌తో శుక్రవారం విజయవాడ వీధులు దద్దరిల్లాయ.

09/02/2017 - 03:08

విశాఖపట్నం, సెప్టెంబర్ 1: పదేళ్ల కిందట విశాఖ జిల్లా వాకపల్లి గ్రామంలో గిరిజన మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం జరిపిన సంఘటన మళ్లీ తెరమీదకు వచ్చింది.

09/02/2017 - 03:07

కడప, సెప్టెంబర్ 1: తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్కరికీ మేలుచేయదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న జగన్ పులివెందుల కార్యకర్తలతో మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతోనే టిడిపి గెలిచిందన్నారు. అంతేతప్ప ప్రజాతీర్పుకాదన్నారు.

09/02/2017 - 03:05

కొత్తపేట/మాడుగుల, సెప్టెంబర్ 1: అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దొరికి పోయారు. తూర్పుగోదావరిలో ఫైర్ ఆఫీసర్, విశాఖ జిల్లాలో ఓ జూనియర్ అసిస్టెంట్ ఏసిబికి చిక్కారు.

09/02/2017 - 01:47

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 1: రాష్ట్రంలో నలుగురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం నార్త్ కోస్టల్ జోన్ ఐజిగా పని చేస్తున్న కుమార్ విశ్వజిత్‌ను ఆర్గనైజేషన్ అండ్ కో ఆర్డినేషన్ ఐజిగా బదిలీ చేశారు. కాగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తు వెయిటింగ్‌లో ఉన్న ఎన్ శ్రీ్ధరరావుకు పర్సనల్ ఐజిగా బాధ్యతలు అప్పగించారు.

09/02/2017 - 01:47

అనంతసాగరం, సెప్టెంబర్ 1: భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమె ద్వారా కన్న బిడ్డల్ని కూడా అంతమొందించాడో కసాయి భర్త. శుక్రవారం సాయంత్రం నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు గ్రామ గిరిజనకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెంది న పెంచలప్రసాద్ మరింత సంపాదించడానికి కువైట్ దేశానికి వెళ్లాడు. ప్రసాద్ తిరిగి వచ్చేలోగా భార్య భాను మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.

09/02/2017 - 01:46

బొమ్మనహాల్, సెప్టెంబర్ 1: తాగునీటి అవసరాల నిమిత్తం తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి విడుదల చేసిన నీరు శుక్రవారం అనంతపురం జిల్లా సరిహద్దుకు చేరుకుంది. రెండు రాష్ట్రాల సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద గంగకు హెచ్చెల్సీ అధికారులు పూజలు చేశారు. 500 క్యూసెక్కుల నీరు తుంగభద్ర నుంచి విడుదల కాగా జిల్లా సరిహద్దుకు 350 క్యూసెక్కులు చేరినట్లు తెలుస్తోంది.

09/02/2017 - 01:45

విశాఖపట్నం(జగదాంబ), సెప్టెంబర్ 1: నదీ జలాల పరిరక్షణ, నదుల్లో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ(సత్య) డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసాన్ని తక్షణమే మార్చుకోవాలన్నారు. నదీ స్థలాన్ని ఆక్రమించి చంద్రబాబు ఇల్లు కట్టుకున్నారన్నారు.

09/02/2017 - 01:45

మలికిపురం, సెప్టెంబర్ 1: ప్రధాని మోదీ ప్రపంచానికే వైబ్రేషన్స్ తీసుకువస్తుంటే స్మార్ట్ విలేజ్‌గా ఎంపికైన మోరి భారత దేశానికి వైబ్రేషన్స్ తెస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి రామాంజనేయులు అన్నారు. మోరి స్ఫూర్తిగా రాష్ట్రంలో మరో 425 గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా అభివృద్ధిచేయడానికి ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నారన్నారు.

09/02/2017 - 01:44

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 1: మావోయిస్టు నేత గణపతి పేరుతో డబ్బులు డిమాండు చేస్తూ పలువురిని బెదిరిస్తున్న నకిలీ మావోయిస్టును టాస్క్ఫోర్స్, పటమట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి గజరావ్ భూపాల్ వివరాలు వెల్లడించారు.

Pages