S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/01/2017 - 03:49

అమరావతి, ఆగస్టు 31: 2020లో న్యూయార్క్‌లో జరిగే అంతర్జాతీయ బౌద్ధ ప్రదర్శన కోసం ప్రపంచంలోని ప్రసిద్ధ మ్యూజియాల్లో ఉన్న అమరావతి, ఆంధ్రదేశపు బౌద్ధ విశేషాలను సేకరించే పని చురుగ్గా సాగుతోంది. ఒకనాడు బౌద్ధ మతాన్ని అక్కున జేర్చుకుని ఆదరించిన ఆంధ్రదేశపు చారిత్రక విశేషాలను ప్రపంచ వ్యాప్తంగా అన్ని మ్యూజియాల నుంచి సేకరిస్తున్నారు.

09/01/2017 - 03:48

అమరావతి, ఆగస్టు 31: మూడున్నరేళ్ల క్రితం వరకూ క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి, తర్వాత పెద్దగా ప్రచారానికి నోచుకోని దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు వైసీపీ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఆ ప్రకారంగా రాష్ట్రంలోని కోటి మందికి వైసీపీని నేరుగా చేర్చే ‘వైఎస్ కుటుంబం’ పేరుతో ప్రణాళికకు పదునుపెట్టినట్లు ‘పికె’ వర్గాలు తెలిపాయి.

09/01/2017 - 03:48

విజయవాడ, ఆగస్టు 31: ‘సెర్ప్’ ద్వారా ఏర్పాటుచేసిన 18వేల రైతు గ్రూపులకు సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్టస్థ్రాయి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత గురువారం తెలిపారు.

09/01/2017 - 03:47

విజయవాడ, ఆగస్టు 31: పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు వారం రోజుల్లో రెండు నెలల వేతనాలు చెల్లించాలని యాజమాన్యాన్ని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఆదేశించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో చాగల్లు మండలంలో ఉన్న జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ (చాగల్లు ఫ్యాక్టరీ) యాజమాన్యం, కార్మికులతో సమావేశమయ్యారు.

09/01/2017 - 03:46

హైదరాబాద్, ఆగస్టు 31: సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణకు ఆదేశించారా లేదా అనే అంశంపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రమా మేల్కోటే, సయ్యద్ ఇక్బాల్ భాషా దాఖలు చేసిన పిటిషన్‌ను దర్మాసనం విచారించి ఆదేశాలు జారీ చేసింది.

09/01/2017 - 03:46

విజయవాడ, ఆగస్టు 31: రాష్ట్రంలోని నిరుపేద కిడ్నీ రోగులకు నెలకు 2500 రూపాయల పింఛనును సెప్టెంబర్ 1 నుంచి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ రోగులు ఇతర పింఛన్లు పొందుతున్నప్పటికీ, ఈ సాయం కొనసాగనుంది. గత నెల 20న ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, సెర్ప్ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పింఛను చెల్లింపునకు మార్గం సుగమం చేసింది. దీని వల్ల ప్రస్తుతం 1575 మంది రోగులు లబ్ధి పొందనున్నారు.

09/01/2017 - 03:45

విజయవాడ, ఆగస్టు 31: యాజమాన్యపు లోపాల వల్ల విద్యా సంవత్సరం నష్టపోయి వీధులపాలైన కడప జిల్లా ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అంశంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని, విద్యార్థుల భవిష్యత్తును నష్టపోకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

09/01/2017 - 03:44

విజయవాడ, ఆగస్టు 31: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ నుంచి అమల్లోకి తెచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సిపిఎస్)కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఇంతకాలం కొనసాగుతూ వస్తున్న ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ విజయవాడలో ‘మిలీనియం మార్చ్’కు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు సన్నద్ధమవుతున్నారు.

09/01/2017 - 03:44

హైదరాబాద్, ఆగస్టు 31: పరిశ్రమ శాఖకు చెందిన డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ బి యోగేశ్వర రావుకు ప్రత్యేక ఏసీబీ కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2002లో పరిశ్రమల శాఖకు చెందిన రూ. 46.48 లక్షలు అక్రమాలకు పాల్పడినందుకు గానూ, అతనిపై ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలో కేసు నమోదైంది.

09/01/2017 - 01:48

తిరుపతి, ఆగస్టు 31: భారతదేశ ప్రథమ పౌరుడు, రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తిరుపతికి చేరుకోనున్నారు. రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా తిరుపతికి వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలుకడంతోపాటుగా గట్టి భద్రతా చర్యలు చేపట్టడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.

Pages