S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/01/2017 - 01:47

కశింకోట, ఆగస్టు 31: విశాఖ జిల్లా కశింకోట వద్ద గురువారం అంబులెన్స్ ఢీకొట్టిన సంఘటనలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కశింకోట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన కరకా రామునాయుడు, పైడితల్లి వ్యవసాయదారులు.

09/01/2017 - 01:46

విశాఖపట్నం, ఆగస్టు 31: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మరో 24 గంటల పాటు ఒక మోస్తరు వర్షాలు కురియనున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కాగా, బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి.

09/01/2017 - 01:46

రాజమహేంద్రవరం, ఆగస్టు 31: కాపులకు తెలుగుదేశం ప్రభుత్వమే న్యాయం చేస్తుందని, బీసీల్లో చేర్చేందుకు మేనిఫేస్టో హామీ మేరకు కచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని, ఈలోగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నివిధాలా చర్యలు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు.

09/01/2017 - 01:45

రాజమహేంద్రవరం, ఆగస్టు 31: ఉపనది శబరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి గురువారం సాయంత్రం 2.97 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెట్టారు. 10.30 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహిస్తూ బ్యారేజి నాలుగు ఆర్మ్‌లలో మొత్తం 175 గేట్లను 0.60 మీటర్లకు ఎత్తి వరద జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు.

09/01/2017 - 01:44

అనంతపురం, ఆగస్టు 31: తుంగభద్ర జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో రాయలసీమ జిల్లాల రైతుల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నా వర్షాలకు తుంగభద్ర జలాశయానికి ఓ మోస్తరు వరద వచ్చిచేరుతోంది. ఈ వరద మరికొన్ని రోజుల పాటు కొనసాగితే సాగునీరు అందే అవకాశాలు ఉంటాయని రైతులు భావిస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తుంగభద్ర రిజర్వాయర్ ఈసారి కూడా నిండలేదు.

09/01/2017 - 01:43

గుంటూరు, ఆగస్టు 31: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగాలపై గుంటూరు జిల్లా ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాఘవేంద్రరావు నివాసాలపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఎసిబి డిఎస్‌పి దేవానంద్ పంత్ ఆధ్వర్యంలో 9 బృందాలు గుంటూరు, సత్తెనపల్లి, తుళ్లూరు, మంగళగిరి, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాఘవేంద్రరావు కుటుంబ సభ్యుల ఇళ్లల్లో గురువారం సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు, నగలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

09/01/2017 - 01:57

అమరావతి, ఆగస్టు 31: గాంధీ జయంతి, ప్రపంచ అవాస దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద నిర్మించిన లక్ష ఇళ్లల్లో గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు.

09/01/2017 - 01:41

సింగరాయకొండ, ఆగస్టు 31: కేరళ నుంచి ఢిల్లీ వెళుతున్న నిజాముద్దీన్ మిలీనియం ఎక్స్‌ప్రెస్ నుంచి ఓ యువతి దూకి గాయాలు పాలైన సంఘటన గురువారం మధ్యాహ్నం సింగరాయకొండ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఎస్‌ఐ రవణయ్య కథనం ప్రకారం విజయవాడకు చెందిన ముగ్గురు యువతులు చెన్నైలో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. బక్రీద్ పండుగకు గురువారం వారు చెన్నై నుంచి మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరారు.

08/31/2017 - 02:19

విజయవాడ: రాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి అవసరాలకు సరిపడా ఇసుక అందుబాటులో ఉండేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి వెంకట సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రి, సూరయ్యపాలెం ఇసుక రీచ్‌లను బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.

08/31/2017 - 02:18

అమరావతి: వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్, అందుకోసం వివిధ రాష్ట్రాల్లో బిజెపి, ఆప్, కాంగ్రెస్ వంటి పార్టీలను గెలిపించిన ప్రశాంత్ కిశోర్ (పీకే)ను కన్సల్టెంటుగా నియమించుకున్నారు. జగన్‌ను గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న పీకే, ఆ మేరకు తన బృందాలను ఇప్పటికే జనక్షేత్రంలోకి పంపించారు.

Pages