S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/30/2017 - 02:04

హైదరాబాద్, ఆగస్టు 29: ఎపి వ్యవసాయ విద్య చదువుతున్న విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడును కోరారు. విద్యార్థుల డిమాండ్లను తాను బాసటగా ఉంటానని, వారి సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాడతానని పవన్‌కల్యాణ్ తెలిపారు. నెలరోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

08/30/2017 - 02:03

గాజువాక/పరవాడ, ఆగస్టు 29: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్‌లకు దేశవ్యాప్తంగా డిమాండ్ తగ్గుతోందని సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) గ్రూపు జనరల్ మేనేజర్ నరేష్‌కుమార్ సిన్హా అన్నారు. మంగళవారం పరవాడలోని సింహాద్రి దీపాంజలినగర్ సముద్రిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాలుష్య రహితంగా తయారయ్యే విద్యుత్ వినియోగం పెరుగుతోందన్నారు.

08/30/2017 - 02:01

విశాఖపట్నం, ఆగస్టు 29: రెండు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్ నేవీ చీఫ్ అడ్మిరల్ నిజాముద్దీన్ అహ్మద్, ఆరుగురు సభ్యుల ఉన్నత స్థాయి బృందం మంగళవారం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. భారత్, బంగ్లా నౌకాదళ సంబంధాలపై వీరు చర్చించనున్నారు. నిజాముద్దీన్ అహ్మద్‌కు, తూర్పు నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ ఘన స్వాగతం పలికారు.

08/30/2017 - 01:58

అమరావతి, ఆగస్టు 29: మాట మార్చడం మడమ తిప్పడం తన రక్తంలోనే లేదని తరచూ చెప్పే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత మాట మార్చి విమర్శలకు గురయ్యారు. ఎమ్మెల్సీగా గెలిచిన కొద్దిరోజులకే తన పార్టీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించి, టిడిపి మాదిరి కాకుం డా రాజకీయాల్లో నైతిక విలువలకు స్థానం కల్పించారన్న ప్రశంసలు అందుకున్నారు.

08/30/2017 - 00:08

తిరుపతి, ఆగస్టు 29: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు 3వ తేదీ సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. 4న పవిత్రప్రతిష్ట, 5న పవిత్ర సమర్పణ, 6న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. కాగా పవిత్రోత్సవాల సందర్భంగా పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.

08/30/2017 - 00:08

విశాఖపట్నం, ఆగస్టు29: విశాఖ నగరానికి సమీపంలోని పోతినపల్లయ్యపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఒక ఇంట్లో దుండగులు తుపాకీ, కత్తులు చూపించి 3 కేజీల బంగారాన్ని దోచుకుపోయారు. క్రైం డిసిపి షిమాషి బాజ్‌పాయ్ విలేఖరులకు వివరించారు. రాజస్థాన్‌కు చెందిన రాకేష్‌కుమార్ పిఎంపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వెండి వ్యాపారం చేస్తున్నాడు.

08/30/2017 - 00:07

కర్నూలు, ఆగస్టు 29: కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేకత కలిగిన భూమా కుటుంబానికి ఉప ఎన్నికలు అచ్చొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ కుటుంబం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా వీరిలో భూమా వీరశేఖరరెడ్డి మినహా అందరూ ఉప ఎన్నిక ద్వారానే చట్టసభలకు ఎన్నిక కావడం గమనార్హం. 1989 సాధారణ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఎన్నికైన భూమా వీరశేఖరరెడ్డి 1992లో గుండెపోటుతో మరణించారు.

08/30/2017 - 00:06

విశాఖపట్నం, ఆగస్టు 29: రాష్ట్ర ఖజానాలో డబ్బులు నిండుకున్నాయి. గడచిన 20 రోజులుగా రాష్ట్రంలో అన్ని శాఖలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులూ నిలిచిపోయాయి. ఈ నెలకు సంబంధించిన కేవలం జీతాలు మాత్రమే చెల్లించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

08/30/2017 - 00:03

విజయవాడ, ఆగస్టు 29: అపరిష్కృత డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సెప్టెంబర్ 15తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టబోతున్నారు. ఈమేర మున్సిపల్ జెఏసి నేతలు మంగళవారం ప్రభుత్వానికి తమ సమ్మె నోటీస్‌ను అందజేశారు.

08/30/2017 - 00:02

విజయవాడ (క్రైం), ఆగస్టు 29: వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్యమంత్రి మీద చేసిన అభ్యంతర వ్యాఖ్యలను రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజాకు పట్టిన గతే కొడాలి నానీకి కూడా పడుతుందన్నారు.

Pages