S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/30/2017 - 00:02

విజయవాడ (క్రైం), ఆగస్టు 29: రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణ, విపత్తు నివారణ చర్యల విస్తృతికి అగ్నిమాపకశాఖ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రధాన నగరాల్లో ‘సిటీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్’కు రూపకల్పన చేస్తున్నట్లు ఆ శాఖ ఈస్టరన్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ జి శ్రీనివాసరావు చెప్పారు. ఇకనుంచి జిల్లాల వారీగా నెలకు వంద అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

08/30/2017 - 00:01

విజయవాడ, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు ఏపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు నేతృత్వంలో పలువురు ఎన్‌జివో నాయకులు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు నంద్యాల శాసనసభ ఉప ఎన్నికలో గెలుపొందడం పట్ల అభినందనలు తెలిపారు.

08/30/2017 - 00:01

గుంటూరు, ఆగస్టు 29: మావోయిస్టు పార్టీ వినూత్న పంథాతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎదురవుతున్న చేదు అనుభవాలను ఆత్మావలోకనం చేసుకుని భవిష్యత్ వ్యూహానికి సన్నద్ధమవుతోంది. దండకారణ్యంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుకు వ్యూహరచన చేస్తోంది.

08/30/2017 - 00:00

అమరావతి, ఆగస్టు 29: శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒడిశాలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాల ప్రభావంతో నాగావళి, తోటపల్లి, వంశధారకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కలెక్టర్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

08/29/2017 - 03:29

హైదరాబాద్, ఆగస్టు 28: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గెలుపొందడం ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన రెఫరెండం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలా అనుకుంటే అంతకన్నా మూర్ఖుడు మరొకరు ఉండరని ఆయన విమర్శించారు.

08/29/2017 - 03:27

అమరావతి, ఆగస్టు 28: వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ ఎంపిలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడితే తాము అక్కడ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వ్యాఖ్యానించారు. సోమవారం చంద్రబాబు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అవి మాటల్లోనే...

08/29/2017 - 03:10

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
- మంత్రి భూమా అఖిల ప్రియ

08/29/2017 - 03:08

కాకినాడ, ఆగస్టు 28: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో 2 లక్షల 29వేల 373 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు 196 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ముందుగా నమూనా పోలింగ్ నిర్వహించి, తర్వాత పోలింగ్ ప్రారంభిస్తారు.

08/29/2017 - 03:08

విజయవాడ, ఆగస్టు 28: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్, రోజాలతో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తే మాదే విజయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాల ఫలితంతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధం ఉండదని, అక్కడా భారీ మెజారిటీతో గెలవబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టిడిపి మూడేళ్ల పాలనకు నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నిదర్శనమని మంత్రి చెప్పారు.

08/29/2017 - 03:07

విజయనగరం, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విజయనగరం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి ఉప ఎన్నిక కావడంతో అందరూ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబరిచారన్నారు.

Pages