S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/29/2017 - 03:08

విజయవాడ, జూలై 28: బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధి జాస్‌తో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం వెలగపూడి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసింది. ఈ ప్రతినిధి బృందం స్పీకర్ చాంబర్‌లో ఇందుకు సంబంధించి కొద్దిసేపు ముచ్చటించింది. ఒంగోలు జాతి ఎద్దుల పెంపకానికి ఒంగోలు గిత్తలను బ్రెజిల్ దేశంలో పెంచేందుకు ఆసక్తిని చూపుతోంది.

07/29/2017 - 03:05

కాకినాడ, జూలై 28: తాను ఇంటి నుండి బయటకంటూ వస్తే పాదయాత్ర చేసేందుకే వస్తానని, అంతవరకు ఎదురుచూస్తాను తప్ప తన నిర్ణయంలో ఏ విధమైన మార్పు ఉండదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. దమ్ముంటే పోలీసు బలగాలను ప్రభుత్వం వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

07/29/2017 - 03:01

నంద్యాల, జూలై 28: కర్నూలు జిల్లా నంద్యాల ఓటర్లు ఎల్లప్పుడూ విలక్షణ తీర్పు ఇస్తున్నారు. నంద్యాలలో కేవలం రెండు సామాజికవర్గాల మధ్యే పోటీ జరుగుతోంది. మొదటి నుండి రెడ్డి సామాజికవర్గం, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన వారే నంద్యాల ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అంతేగాక ఏ ఒక్కరినీ వరుసగా రెండుసార్లకు మించి ఎమ్మెల్యేగా గెలిపించడం లేదు.

07/29/2017 - 02:59

అనంతపురం సిటీ, జూలై 28: ఎన్నికల ముందు ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మంచి గద్దెనెక్కిన ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు కల్పించలేకపోయారని ఢిల్లీ ఎన్‌ఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్‌కుమార్ అన్నారు. విద్యార్థి, యువత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో శుక్రవారం లాంగ్‌మార్చ్ నిర్వహించారు.

07/29/2017 - 02:58

న్యూఢిల్లీ, జూలై 28: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యా సంస్థలకు నిధులను మంజూరు చేయాలని అమలాపురం టిడిపి ఎంపీ పి. రవీంద్రబాబు లోక్‌సభలో విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఐఐఎం 2017 బిల్లుపై లోక్‌సభలో జరగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. విభజన అనంతరం విశాఖలో ఐఐఎం ఏర్పాటు చేశారని, దానికి పూర్తిస్థాయిలో వౌలిక వసతులు కల్పించేందుకు నిధులను మంజూరు చేయాలన్నారు.

07/29/2017 - 02:57

విజయవాడ, జూలై 28: బిసిలకు నష్టం లేకుండా తమ ప్రభుత్వం త్వరలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తుందని కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (కాపు కార్పొరేషన్) చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు.

07/29/2017 - 02:57

తెనాలి, జూలై 28: జిఎస్టీవల్ల ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు సహజమేనని, ఆగస్టు ఒకటిన మరోమారు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని అందులో పలు సమస్యలపై చర్చిస్తారని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలిలో నూతనంగా ఏర్పాటుచేసిన రెండు వాణిజ్య పన్నులశాఖ కార్యాలయాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

07/29/2017 - 02:56

న్యూఢిల్లీ, జూలై 28: ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు, నూతన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఢిల్లీ నుంచి కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిలపై ఆయన విమర్శలు గుప్పించారు.

07/29/2017 - 01:47

హైదరాబాద్, జూలై 28: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించక పోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీకాలం ముగిసిన కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా గతంలోనే హైకోర్టు ఆదేశించినా నిర్వహించకపోవడానికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

07/29/2017 - 01:46

అనంతపురం, జూలై 28: సహజ వనరులైన పవన, సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేసిన నేపథ్యంలో అనంతపురం జిల్లాకు ఊరట కలుగుతోంది. జిల్లాలో పవన, సౌర విద్యుత్ వినియోగంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ వినియోగించుకుంటున్నా రు. దీంతో గణనీయంగా విద్యుత్ బిల్లులు తగ్గిపోతున్నాయి.

Pages